మాళవిక, యశోధర్‌లు హోటల్ గదిలో ఉన్నపుడు ఫైర్ ఆక్సిడెంట్ జరుగుతుంది. మాళవిక కళ్లు తిరిగిపడిపోవడంతో యశ్ తనని చేతుల మీద మోసుకుని వస్తాడు. తన భర్తని అలా చూసేసరికి వేద గుండె బద్ధలవుతుంది. మరోవైపు కైలాష్ అభిమన్యుని రెచ్చగొడతాడు. మాళవిక అంతుతేల్చేందుకు అభి సిద్ధమవుతాడు. ఆ తర్వాత అక్టోబర్ 31 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
ఖుషిని కౌగిలించుకుని తన బాధనంతా చెప్పుకుంటుంది వేద. అక్కడ మాళవికని ఇంట్లో వదిలేసి వెళ్తున్న యశోధర్‌ని అభి అడ్డుకుంటాడు. అపుడు ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. హోటల్ గదిలో మాళవికతో యశోధర్ ఉన్న విషయం ఇంట్లో తెలిసి కోపంతో రగిలిపోతారు. రత్నం, మాళినిలు యశ్ ఇంటికి వస్తే తిట్టాలని ఎదురు చూస్తారు. మరోవైపు వేద, యశోధర్‌లు వేర్వేరుగా జరిగింది తలుకుంటూ బాధపడతారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన యశ్‌ని తల్లిదండ్రులు నిలదీస్తారు. తెగదెంపులు చేసుకున్న మాళవిక నీ కూతుర్ని అనాథ చేసి మన పరువు ముక్కులు చేసింది. అలాంటిది మళ్లీ నీకు దగ్గరవ్వాలనకోవడం దాని దుర్భుద్ధి. వేదకు నీకు మధ్య చిచ్చు పెట్టాలన్నది దాని ప్లాన్. అసలు మీ ఇద్దరి మధ్య మళ్లీ ఏం జరుగుతుందిరా అంటూ కొడుకుని నిలదీస్తుంది మాళిని. మీరనుకున్నట్టు మా మధ్య ఏం లేదని యశ్ చెప్పినా మాళిని నమ్మదు. మనందరం ఇంత బాగున్నామంటే కారణం వేద. మన ముఖాల్లో వెలుగు రావడానికి కారణం వేద అంటూ కోడల్ని పొగడుతుంది మాళిని. నష్టపోతుంది, కష్టపడుతుంది అనుకుంటూ బాధపడుతుంది. సూటిగా జవాబు చెప్పి తీరాల్సిందే అంటూ నిలదీస్తుంది కొడుకుని. అంతలోనే వేద ‘లేదు అత్తయ్య. ఆయన్ని ప్రశ్నించే హక్కు మీకు లేదు. ఇలా అంటున్నందుకు నన్ను క్షమించండి. తల్లిగా మీరు ఆయన్ని అడగచ్చు. కానీ ఆయన నా భర్త. నేను ఆయన భార్యని. నా భర్తని నిలదీసే హక్కు మీకు లేదు. ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. మా మధ్య మూడో మనిషి జోక్యం అవసరం లేదు’ అని తేల్చి చెప్తుంది. భర్త చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్తుంది. యశ్ భార్యకు జరిగింది చెప్పే ప్రయత్నం చేస్తాడు కానీ వేద ఆ అవకాశం ఇవ్వదు. ఫ్రెష్ అయి రమ్మని పంపిస్తుంది.
ఆ తర్వాత సీన్‌లో బంగారం.. అంటూ మాళవిక దగ్గరికి వెళ్తాడు అభి. అసలు ఆ హోటల్‌కు యశ్‌తో నువ్ ఎందుకు వెళ్లావ్ అని అడుగుతాడు. ‘నాకు ఆక్సిడెంట్ కేసులో చాలా హెల్ప్ చేస్తున్నాడు’ అని మాజీ భర్తని పొగడుతుంది మాళవిక. దాంతో అభికి ఒళ్లు మండిపోతుంది. ఆ యశోధర్‌తో నన్ను పోల్చితే బాగుండదని అరుస్తాడు అభి. నేను నీ భార్యని కాదంటూ రిటర్న్ జవాబిస్తుంది మాళవిక. ఇక్కడ వేద మాత్రం భర్తని నిలదీయకుండా అన్నం పెట్టి తినమంటుంది. లోలోపలే కుమిలిపోతుంది.
నువ్ నా మెడలో తాళి కట్టకుండా బానిసలా చూస్తున్నావంటూ అభిని ప్రశ్నిస్తుంది మాళవిక. కనీసం ఆ యశ్‌ని చూసి నేర్చుకో అంటూ వార్నింగ్ ఇస్తుంది. దాంతో ఎంత పొగరు నీకు. నా ముందు యశ్‌ని పొగడుతున్నావా. నీకు తెలియని అభిమన్యు బయటికి వస్తే బలైపోతావ్ అని మండిపడతాడు అభి లోలోపల. భర్త కోసం వేద పడుతున్న తపన చూసి పొంగిపోతుంది మాళిని. ఇలాంటి భార్య దొరకడం మన యశ్ అదృష్టం అంటూ కోడల్ని పొగడుతుంది. ‘నన్నేం అడగాలనిపించడంలేదా? వేద’ అంటూ మౌనంగా ఉన్న భార్యతో అంటాడు యశ్. మీ దగ్గరి నుంచి వచ్చే సమాధానాల కోసం నా దగ్గర బోలెడన్ని ప్రశ్నలు ఎదురుచూస్తున్నాయి అంటుంది వేద. నువ్ అనుకున్నట్టు అక్కడేం జరగలేదు వేద అని యశ్ చెప్పినా వేద వినిపించుకోదు. ‘మాళవిక మీ మాజీ భార్య. నిన్నటిదాకా అసహ్యించుకున్నారు. ఇపుడు రహస్యంగా కలుసుకున్నారు. అర్ధరాత్రి ఫోన్లు మాట్లాడుకోవడాలు, కలిసి కార్లో తిరగడాలు, అడిగితే అబద్ధం చెప్పడం..’ అని తన మనసులోని బాధనంతా వెల్లగక్కుతుంది వేద. మరి యశ్ నిజం చెప్తాడా? లేదా? తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..