ఆక్సిడెంట్ కేసు గురించి మాట్లాడేందుకు వేద పోలీస్ స్టేషన్‌కు వెళ్తుంది. ఎలాగైనా నిందితులని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తుంది. ఆ తర్వాత పేరేంట్స్ మీటింగ్ ఉందని స్కూల్‌కు బయల్దేరుతుంది వేద. దారిలో యశోధర్ మాళవికతో కనిపిస్తాడు. అది చూసిన వేద ఏం చేస్తుందో ఈ రోజు ఎపిసోడ్‌లో చూద్దాం..
దారిలో కనిపించిన యశోధర్‌ని చూసి.. ఇద్దరం కలిసి పేరేంట్స్ మీటింగ్‌కు వెళ్లొచ్చని హ్యాపీగా ఫీలవుతుంది వేద. కారు పార్క్ చేసి వెళ్లేలోపే మాళవిక వచ్చి మాట్లాడుతుంది యశోధర్‌తో. అది చూసి వేద షాకవుతుంది. చాటుగా ఉండి ఏం జరుగుతుందో చూస్తుంది వేద. ‘అవతల లాయర్ మన కోసం వెయిట్ చేస్తున్నాడు’ అంటూ మాళవికని కారులో ఎక్కించుకుని బయల్దేరపోతాడు. అంతలోనే వేద కావాలని భర్తకు ఫోన్ చేసి ఎక్కడున్నారని అడుగుతుంది. తడబడుతూ సమాధానం చెప్తాడు యశ్. మాళవిక నిజం చెప్పొద్దంటూ ఫోర్స్ చేస్తుంది మాజీ భర్తని. దాంతో నేను బిజీగా ఉన్నానంటూ తప్పించుకుంటాడు యశోధర్. కారు వెనకాలే ఉన్న వేదని చూస్తుంది మాళవిక. తనకో ఝలక్ ఇచ్చేందుకు యశ్‌తో సీటు బెల్ట్ పెట్టించుకుంటుంది. అది చూసి వేద ఇంకోలా అర్థం చేసుకుని బాధపడుతుంది. ఆ తర్వాత వేద భర్త చెప్తున్న అబద్ధాల్ని తలుచుకుంటూ కుమిలి కుమిలి ఏడుస్తుంది. నాకే ఎందుకు ఇలా జరుగుతుందంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది.
సీన్ కట్ చేస్తే.. చిత్ర వసంత్ దగ్గరికి వెళ్తుంది. ఏమండీ.. అంటూ సిగ్గుపడుతుంది. తనే స్వయంగా వంట చేసుకుని వచ్చి కాబోయే భర్తకు పెడుతుంది. అద్భుతం అంటూ చిత్రని కొనియాడతాడు వసంత్. ఆ తర్వాత వదినలా మాట్లాడుతున్నావ్ అంటూ.. వేద, యశ్‌లను గుర్తుచేసుకుంటారు చిత్ర, వసంత్. వాళ్లని గుర్తుచేసుకుంటూ నవ్వుకుంటారు సరదాగా. మనకి యశ్, వదినలే ఆదర్శం అంటాడు వసంత్. ఆ తర్వాత వేద ఏడుస్తూ.. సోఫాలో కూర్చుని అమ్మా కాఫీ అంటుంది. మళ్లీ గుర్తుకు వచ్చి వద్దులే సారీ అని చెప్తుంది సులోచనకు. ‘ఏంటి వేద అలా ఉన్నావ్’ అని సులోచన అడగ్గానే.. యశ్ చేసిన పని తలుచుకుని వచ్చి కాళ్ల దగ్గర కూర్చుని ఏడుస్తుంది. కానీ నిజం చెప్పకుండా ఏవేవో మాట్లాడుతుంది వేద. కానీ సులోచన నిజం పసిగట్టి ఏమైందో చెప్పు నాన్నా… అంటూ బుజ్జగించి అడుగుతుంది.
ఆ తర్వాత సీన్‌లో మాళవిక, యశ్‌లు లాయర్‌ని కలిసేందుకు హోటల్‌కు వెళ్తారు. అక్కడ వేద పడుతున్న టెన్షన్‌కి కారణం అల్లుడుగారేనని కూతురుతో అంటుంది సులోచన. నా ఆక్సిడెంట్‌కు కారణమైన వారిని పట్టుకుని జైలుకు పంపేందుకు పట్టుదలతో ఉన్నారు. ఎక్కువ శ్రమ పడుతున్నారు. నీ భర్త పడే టెన్షన్‌లో సగం నువ్ పడుతున్నావ్ అంతేనా? అంటుంది వేదతో. వేద ఇప్పటికీ నీతో చెప్పకుండా నాలో దాచుకున్న ఓ రహస్యం చెప్పనా అని సులోచన అనగా చెప్పమ్మా అంటుంది వేద. ‘ఆ యశోధర్‌కి నిన్ను ఇచ్చి పెళ్లి చేయడం నాకిష్టం లేదు. ఇద్దరు పిల్లలకు తండ్రి. మొదటి భార్య వెళ్లిపోయింది కానీ ఖుషికి తల్లి కావాలన్న నీ ఆరాటం చూసి ఒప్పుకున్నా. అతనితో నీ పెళ్లికి ఒప్పుకోవడానికి ఒకే ఒక కారణం ఏంటంటే ఖుషితో నువ్ పెనవేసుకున్న బంధం. పెళ్లిపీటల మీద నువ్ ఖుషితో కూర్చున్నప్పుడు నీలో నాకు కూతురు కనబడలేదు తల్లి కనబడలేదు. తల్లి స్థానం తీసుకున్నాకే నువ్ భార్య స్థానం తీసుకున్నావ్. పెళ్లైన ఇన్నాళ్ల తర్వాత నాకు అనిపిస్తుంది. ఎంత గొప్ప భార్య స్థానం అమ్మ నీది. కూతుర్ని భర్త చేతుల్లో పెట్టేటపుడు ఏ తల్లైనా ఏం కోరుకుంటుందో తెలుసా. మా తర్వాత నిన్ను అలా చూసుకోవాలని అనుకుంటారు. మా అల్లుడి మీద నమ్మకం నాకుంది’ అంటూ యశోధర్‌ని పొగుడుతుంది సులోచన.
అల్లుడి మీద ఎంత గుడ్డి నమ్మకం అమ్మా నీకు అంటూ బాధపడుతుంది వేద. అక్కడ మాళవికతో నా భార్య శ్రీమతి పండితారాధ్యుల వేదశ్విని అని చెప్తాడు యశ్. ఆ తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.