నిన్నటి ఎపిసోడ్‌లో యశోధర్ చేస్తున్న మోసాన్ని నిద్రలో ఉన్న భార్యకు చెప్తూ సారీ చెబుతాడు. ఆ తర్వాత ఖుషీని రెడీ చేసి స్కూల్‌కి తీసుకెళ్తాడు. మరోవైపు మాళవిక మాజీ భర్తను మళ్లీ తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తుంది. అందంగా ముస్తాబై యశోధర్‌నా కలవడానికి వస్తుంది. ఆ తర్వాత అక్టోబర్ 25 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
అర్ధరాత్రి మాళవిక ఫోన్ నుంచి తన భర్తకు వచ్చిన మెసేజ్ చూసి వేదశ్విని కుప్పకూలిపోతుంది. నిద్రలో ఆలోచిస్తూ అలాగే పడుకుంటుంది. ఉదయం లేచి ఖుషీని స్కూల్‌కు తీసుకెళ్లాలని హడావుడిగా పరుగెత్తుతుంది. మాళవికని అడగ్గా.. యశ్ రెడీ చేసి స్కూల్‌కి తీసుకెళ్లాడని చెప్పడంతో వేద సంబరపడిపోతుంది. అక్కడ ఖుషీ మాటలకు యశోధర్ ఆలోచనలో పడిపోతాడు. దేవుడే ఖుషీతో ఇలా మాట్లాడించాడా? అని అనుకుంటాడు. అంతలోనే ఆదిని తీసుకుని మాళవిక స్కూల్‌కి ఎంట్రీ ఇస్తుంది. ఆదితో మీ డాడీ ఉన్నాడని ధైర్యం చెప్పి స్కూల్‌కి పంపిస్తాడు యశ్. మాళవిక యశ్‌కు గతాన్ని గుర్తు తెచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ అందుకు లొంగడు మాజీ భర్త.
ఆ తర్వాత సీన్‌లో వేద రెడీ అయి బయల్దేరుతుండగా సులోచన, వరదరాజులు కనిపిస్తారు. పడిపోతున్న తండ్రికి సాయంగా నిలుస్తుంది వేద. భార్య పరిస్థితిని చూసి బాధపడతాడు వరదరాజులు. భర్తని చూసి సులోచన కూడా కంటతడి పెడుతుంది. అక్కడ యశోధర్ మాళవికతో మాట్లాడతాడు. వేదతో అసలు నిజం చెప్పేస్తానని మాళవికతో అంటాడు. కానీ మాళవిక అందుకు ఒప్పుకోదు. జరగరానిది జరిగితే నేనుండను, ఆది ఉండడు అని భయపెడుతుంది భర్తని. అప్పుడే ఆది వచ్చి మళ్లీ యశ్ దగ్గర మాట తీసుకుంటాడు. నా మీద ఒట్టేసి మమ్మీ ఎప్పటికీ నాతోనే ఉంటుందని చెప్పు నాన్నా.. అని బలవంతం చేస్తాడు. దాంతో యశోధర్ ప్రామిస్ చేస్తాడు. నాకు మీ సంతోషం కన్నా ఏది ముఖ్యం కాదని మాటిస్తాడు. నీకోసం మీ అమ్మని కాపాడతానని హామీ ఇస్తాడు.
అక్కడ మాళవిక ఇంటి పనులు చేస్తూ.. తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటుంది. అంతలోనే మాళవికకు పోలీసు స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది. ఆక్సిడెంట్ కేసు గురించి మాట్లాడి వస్తానని వెళ్తుంది వేద. అక్కడ కేసు గురించి లాయర్‌తో మాట్లాడడానికి యశ్ మాళవికను తీసుకెళ్తాడు. ఆదిని అడ్డుపెట్టుకుని వేద జీవితాన్ని అల్లకల్లోలం చేస్తాననుకుంటుంది మాళవిక మనసులో. పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన వేద కేసుకు సంబంధించిన వివరాల్ని అడిగి తెలుసుకుంటుంది. తన తల్లి పరిస్థితిని ఇన్‌స్పెక్టర్‌కు వివరిస్తూ బాధపడుతుంది. కేసును సీరియస్‌గా తీసుకోమని సూచిస్తుంది వేద. అక్కడ వేద చెప్తున్న మాటలకు పూర్తి వ్యతిరేకంగా నిందితుడిని తప్పించే ప్రయత్నం చేస్తాడు యశోధర్. ఆ తర్వాత వేద పేరెంట్స్ మీటింగ్ ఉందని స్కూల్‌కి వెళ్తుంది.
దారిలో మాళవిక కోసం ఎదురుచూస్తున్న యశోధర్ వేద కంటపడతాడు. ఇక్కడెందుకు ఉన్నాడని వేద కారు పక్కకు పెట్టి వచ్చే లోపే మాళవిక వచ్చి యశోధర్‌ని కలుస్తుంది. అది చూసి వేద షాకవుతుంది. మరి వేద పరిస్థితేంటో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..