వేదని హర్ట్ చేసినందుకు యశోధర్ గిల్టీగా ఫీలవుతాడు. ఆ తర్వాత అక్టోబర్ 21 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం.. ఖుషీ వేదకు స్టోరీ చెబుతుంది. మిగతా కథ నేను చెప్తానంటుంది వేద. అలా కాదంటూ ‘హీరో విలన్‌కి పనిష్మంట్ ఇవ్వడంటా. కాపాడాలని ప్రయత్నిస్తాడట. ఆ సంగతి హీరోయిన్ దగ్గర దాచిపెడతాడంటా. హీరోయిన్ దగ్గర దాచిపెట్టడం తప్పు కదా. హీరో బ్యాడ్ కదమ్మా’ అంటూ తల్లికి చెప్తుంది ఖుషి. ఇదంతా కాస్త దూరం నుంచి వింటున్న యశోధర్‌కు తన స్టోరీలా అనిపిస్తుంది. ఖుషి మాటలకు కోపం వస్తుంది. ‘హోం వర్క్ చేయకుండా ఆ స్టోరీలేంటి’ అని అరుస్తాడు. యశ్ కోపం చూసి వేద షాకవుతుంది. దగ్గరకు వచ్చి ఖుషి మీద ఎందుకు అరిచారని నిలదీస్తుంది. మీరు కోపం మీద ఉంటే నా మీద అరవండి. పసిపిల్ల మీద ఎందుకు. పాపం ఖుషి బెదిరిపోయిందంటుంది. ఖుషి బాధపడితే తట్టుకోలేను. నాకు ఖుషి తర్వాతే ఎవరైనా.. అని వార్నింగ్ ఇస్తుంది భర్తకు. ఆ తర్వాత దిగులుగా ఉన్న ఖుషి దగ్గరికి వెళ్లి ఓదారుస్తుంది. డాడీ నా మీద ఎందుకు కోప్పడ్డాడని తల్లిని అడుగుతుంది. అపుడు వేద భర్తని సమర్థిస్తూ ‘ఛ.. ఛ.. డాడీకి నీ మీద కోపమెందుకు. ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నారు కదా. చిరాకులో నీ మీద అరిచాడు. ఆ తర్వాత చాలా ఫీలయ్యాడు. మా మంచి ఖుషీ కదా ఇక పడుకో అంటుంది’.
డాడీ లేకుండా నాకు నిద్ర రాదంటుంది ఖుషి. నాకు కూడా అంటుంది వేద సరదాగా. ఆ తర్వాత యశోధర్ వేద మాటల్ని తలుచుకుంటూ బాధపడతాడు. ఎప్పుడూ లేనిది ఖుషీ మీద అరిచాను. వేద కూడా చాలా ఫీలయింది అనుకుంటాడు మనసులో. ‘అమ్మా ఖుషీ. సారీ తల్లీ’ అని అంటాడు మనసులో. అపుడే వేద బెడ్రూం నుంచి బయటికి వచ్చి యశోధర్‌ని గమనిస్తుంది. ఆక్సిడెంట్ చేసిన వారిని పట్టుకునే టెన్షన్‌లో ఉన్నట్టున్నాడు. నేను కూడా ఆయన మీద అరిచాను. సారీ అండీ అని భర్తని ఉద్దేశించి మనసులోనే చెప్పుకుంటుంది వేద. అంతలోనే ఖుషీ వచ్చి డాడీ దగ్గరికి వెళ్లాలా? అని అడుగుతుంది వేదని. ఓకే అనడంతో ఖుషి యశ్ దగ్గరికి వెళ్లి సారీ చెప్తుంది. నువ్ వర్క్‌లో ఉన్నావట కదా.. నిన్ను డిస్ట్రబ్ చేశాను కద డాడీ. సారీ అంటుంది. దాంతో కూతుర్ని దగ్గరికి తీసుకుని సారీ చెప్పి ముద్దాడుతాడు యశ్. వాళ్లిద్దర్ని అలా చూసి వేద సంబరపడిపోతుంది. ఆ తర్వాత వేద కూడా వచ్చి ఇందాక నా ఖుషి అన్నాను. కాదు మన ఖుషి అంటుంది. ఆ తర్వాత ఖుషి నువ్ లేకపోతే మమ్మీకి కూడా నిద్ర పట్టదట అని సీక్రెట్ రివీల్ చేస్తుంది. సరే పదండి అంటూ వెళ్తారు ముగ్గురు.
బెడ్రూంలో ఖుషి డాడీని స్టోరీ చెప్పమని అడుగుతుంది. మమ్మీ చెప్తుందని అంటాడు యశ్. లేదు ఖుషి ఎవర్ని అడిగితే వాళ్లే చెప్పాలి అంటుంది వేద. ఇక తప్పక యశోదర్ స్టోరీ చెప్తాడు. లిటిల్ ప్రిన్సెస్ అంటూ ఖుషి స్టోరీనే చెప్తాడు యశ్. దాంతో ఖుషి సంబరపడిపోతుంది. నేను చాలా లక్కీ. నాకు మంచి మమ్మీ, డాడీ ఉన్నారని అంటుంది. అదేం కాదు నీ లాంటి బంగారుకొండ ఉన్నందుకు మేమే లక్కీ అంటారు ఇద్దరూ. మమ్మీ, డాడీ అంటే నాకు బోలెడు ఇష్టం. మీ ఇద్దరిలో ఎవరు లేకపోయిన నేను ఉండలేను. మీరిద్దరూ ఎప్పటికీ నాతోనే ఉంటానని ప్రామిస్ చేయండంటుంది పాప. సరేనంటూ ప్రామిస్ చేస్తారు వేద, యశ్. కానీ యశోధర్ మాత్రం ఆదికిచ్చిన మాటని తలుచుకుంటూ.. వేదకు అన్యాయం చేస్తున్నానని గిల్టీగా ఫీలవుతాడు.
బెడ్ మీది నుంచి లేచి వచ్చి.. నిజం దాచి నేను పెద్ద తప్పు చేస్తున్నానని అనుకుంటాడు మనసులో. అందర్నీ మోసం చేస్తున్నానని బాధపడతాడు. ఇది చేయకూడని తప్పు. క్షమించరాని నేరం. జరిగింది వేదకు చెప్పేస్తా. ఆక్సిడెంట్ చేసింది మాళవిక అని చెప్పేస్తా అని బెడ్ దగ్గరికి వెళ్లి వేదని నిద్ర లేపుతాడు. అపుడే మాళవిక నుంచి ఫోన్ వస్తుంది. యశ్‌కు థ్యాంక్స్ చెప్తుంది. ఆది నా రక్తం పంచిన కొడుకు. వాడి కోసం ప్రాణాలివ్వడానికైనా నేను రెడీ మాళవిక. నేను మా లాయర్‌తో మాట్లాడతాను. నథింగ్ టూ వర్రీ అని ధైర్యం చెప్తాడు. ఇంకో విషయం.. నేను వేదకు నిజం చెప్పేస్తానని మాళవికతో అంటాడు. అపుడే వేద నిద్ర లేచి బయటికి వస్తుంది. మరి యశ్ వేదకు నిజం చెప్పేస్తాడా? లేదా? తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..