సులోచనకు ఆక్సిడెంట్ చేసింది అభిమన్యు అని గుర్తిస్తుంది వేద. భర్తకు కాల్ చేసి విషయం చెప్తుంది. దాంతో యశోదర్ వెంటనే మాళవిక ఇంటికి వెళ్తాడు. ఆక్సిడెంట్ చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను అని చెప్పిన యశోదర్ కోపంతో అక్కడికి వెళ్తాడు కానీ అక్కడ కథ మరో మలుపు తీసుకుంటుంది. ఆ తర్వాత అక్టోబర్ 19 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
యశోదర్ మాళవికకు ‘ఆది మన కొడుకు. నిన్ను వాడికి దూరం కానివ్వను’ అని మాటిస్తాడు. అక్కడ వేదేమో భర్తమీద నమ్మకంతో ఎదురు చూస్తుంటుంది. వరదరాజులు, సులోచన కూడా యశోదర్ కోసం చూస్తుంటారు. అసలే రాత్రి.. ఆపై వర్షం.. యశ్ ఇంకా రాకపోవడంతో కంగారు పడతారు అందరూ. ‘ఏం ఆలోచిస్తున్నావమ్మా’ అని వేద అడగ్గా.. ఈ తుఫాను మన జీవితాల్లో తుఫానుగా మారకూడదు. వేదా ఈ రోజు నీ రాశి ఫలాలు చదివాను అంటుంది. నీకు ఇంకా ఈ రాశిఫలాల పిచ్చిపోలేదామ్మ అంటుంది వేద. నాది పిచ్చి కాదమ్మా.. ఆ రోజు నీజీవితంలోకి వచ్చే కొత్త వ్యక్తి గురించి చెప్పాను. కానీ నువ్ నమ్మలేదు. ఆ రోజు జాతకంలో రాసి ఉన్నట్టే జరిగింది. అమ్మా వేద.. ఆ రోజులాగే ఈ రోజు నీ జాతకం చదివాను. నీ జీవితంలో పెద్ద సమస్య రాబోతుందట. నాకు చాలా టెన్షన్‌గా ఉంది వేద అని బాధపడుతుంది సులోచన. ‘అమ్మా.. నీ భయం చూస్తుంటే నాకూ భయం వేస్తుంది’ అంటుంది వేద. ఏ తుఫాను నన్నేం చేయలేదమ్మా.. నవ్ ఉన్నావ్ కదా.. నాకేం కాదమ్మా.. అంటూ తల్లికి ధైర్యం చెప్పి ఇంటికి వెళ్లిపోతుంది వేద. ‘ఏడు కొండలవాడా నా బిడ్డను కాపాడు తండ్రి’ అని దేవుడిని వేడుకుంటుంది సులోచన.
ఆ తర్వాత సీన్‌లో మాళవిక, యశ్‌లు దగ్గరవుతారు. ‘నాకు భయమేస్తుంది. నాకేమైనా అయితే ఆది తట్టుకోలేడు’ అంటూ కంటతడి పెడుతుంది మాళవిక. ఆదికి, నీకు ఏం కానివ్వనని యశ్ చెప్పడంతో ప్రామిస్ చేయమని అడుగుతుంది మాళవిక. సరేనని మాటిస్తాడు యశ్. ఆ తర్వాత ఇంటికి బయల్దేరిన యశోదర్.. తన భార్య వేద, అత్తయ్యకు ఇచ్చిన హామీని గుర్తు చేసుకుంటూ బాధపడతాడు. ‘ఇపుడేం చేయాలి. ఇప్పటికే వేద ఇంట్లో అందరికీ చెప్పి ఉంటుంది. వాళ్లందరూ నేను పోలీసుల దగ్గరికి వెళ్లానని అనుకుంటున్నారు. ఆక్సిడెంట్ చేసింది మాళవికే అని తెలిస్తే వేద రియాక్షన్ ఎలా ఉంటుంది. అయినా ముందు నేను ఆదిని కాపాడుకోవాలి. కానీ ఇంటికెళ్లిన తర్వాత వేదని ఎలా ఫేస్ చేయాలి’ అని ఆందోళన పడతాడు యశోదర్.
ఇంటికెళ్లిన యశ్‌తో వేద.. వాళ్లని పోలీసులకు అప్పచెప్పారా? అని ప్రశ్నిస్తుంది. లేదు మనం తప్పుగా ఆలోచించాం. ఆ కారు ఆక్సిడెంట్‌కి ముందే వాళ్లు ఎవరికో అమ్మేశారటా అంటూ అబద్ధం చెప్తాడు యశ్. దాంతో అందరూ ఒక్కోలా ప్రశ్నిస్తారు యశోదర్‌ని. వేద అందరి నోర్లు మూయించి తన భర్తకు మద్దతు ఇస్తుంది. అమ్మకు ఆక్సిడెంట్ చేసిన వాళ్లు దొరికితే మీరు ఎలాంటి పరిస్థితుల్లో విడిచిపెట్టరు. మీ మీద నాకు నమ్మకం ఉందంటుంది వేద. అంతేకాక తన భర్త గురించి గొప్పగా చెప్పుకుంటుంది అందరితో. వేద మాటలకు యశ్ లోలోపల బాధపడతాడు. ‘నేను నీకు అన్యాయం చేశాను. నన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు’ అనుకుంటూ తన గదిలోకి వెళ్లిపోతాడు.
ఆ తర్వాత ఆక్సిడెంట్ చేసింది ఎవరో అనుకుంటూ ఇంట్లోని వారంతా మాట్లాడుకుంటారు. సులోచనకు న్యాయం జరుగుతుందని నమ్ముతారు. అంతా ఆ దేవుడే చూసుకుంటాడని అంటుంది సులోచన. ‘నాకు మాత్రం ఒక కొడుకు దొరికాడు. నాకు అంత పెద్ద ఆక్సిడెంట్ జరిగి నెత్తుటి మడుగులో పడి ఉన్నపుడు నిన్ను ఆ దేవుడే నాకోసం పంపిచాడు. ఆస్పత్రిలో నాకోసం ఎంతో తాపత్రయపడ్డావు. నువ్ నా అల్లుడివి కాదు కొడుకువి. నిన్ను ఆ దేవుడు చల్లగా చూడాలి’ అని పొగడుతుంది సులోచన యశోదర్‌ని. మాళిని వచ్చి సులోచనని ఓదారుస్తుంది. వీళ్లద్దరూ మన బిడ్డలే వదిన అంటుంది మాళినితో. కానీ యశోదర్ మాత్రం ఏం మాట్లాడకుండా వెళ్లిపోతాడు. దాంతో వేదకి భర్త మీద అనుమానం కలుగుతుంది. ఏమైంది ఈయనకు అనుకుంటుంది లోలోపల. మరి యశోదర్ ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడతాడో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..