పార్టీలో వేద, మాళవికల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అపుడే మాళవిక వేదని దెబ్బకొట్టాలనుకుంటుంది. అందుకు యశోదర్‌కు దగ్గరవుతుంది. మాజీ భర్తతో మాటలు కలిపి గతాన్ని గుర్తుచేస్తుంది. వాళ్లిద్దరూ అలా దగ్గరవడం చూసి వేద తట్టుకోలేకపోతుంది. ఆ తర్వాత అక్టోబర్ 17 ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం..
మాళవికతో యశోదర్ మాట్లాడిన మాటల్ని గుర్తు చేసి బాధపడుతుంది వేద. తనకు తల్లినయ్యే అదృష్టం లేదని ఎమోషనల్ అవుతుంది. అవమానాలకు అలవాటు పడిపోయానని భర్తతో చెప్పుకుంటూ ఏడుస్తుంది. కానీ ఒకటి మాత్రం చెప్తాను. ఆదిని సంతోషపెట్టడం మీ హక్కు. కాదనడానికి నేనెవరిని అంటూ ఫీలవుతుంది. నా మనసులో ఆది స్థానం ఆదిదే. నీ స్థానం నీదే.. ఇక ఆ మాళవిక అంటావా కేవలం ఆదికి తల్లి మాత్రమే అని.. యశోదర్ చెప్తుండగానే నేను కూడా ఖుషికి తల్లేనని అంటుంది వేద. మన ఇద్దరి మధ్య ఒప్పందం కూడా అదే కదా.. నేను కేవలం ఖుషీకి తల్లిని మాత్రమే అంటుంది మల్లీ. నాకోసం మాళవిక మీద చీటికి మాటికి అరవడం మానేయండి అని భర్తని వేడుకుంటుంది వేద. నువ్ చెప్పాక కాదనేది ఏముంది అంటాడు యశ్. నేనొకటి అడగానా అని వేద అడగ్గా.. అడుగు అంటాడు యశ్. ‘ఇప్పటికీ మీకు మాళవిక మీద ప్రేమ ఉంది కదా.. యు స్టిల్ లవ్ మాళవిక’ అంటుంది వేద. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ రోడ్డుపక్కన కలిసి కూర్చుని తింటారు. అపుడు యశ్.. వేద మాటల్ని గుర్తు చేసుకుంటాడు. ఇందాక నువ్ మాళవిక మీద ప్రేమ ఉందా అని అడిగావ్ కదా.. నాకూ ఒకటి అడగాలని ఉంది అంటాడు యశ్. ఊ అని వేద అనగా.. ఆర్ యు ఇన్ లవ్ విత్ మీ అని ప్రశ్నిస్తాడు. దాంతో వేద అలానే చూస్తుండి పోతుంది భర్తని.
మరుసటి రోజు ఉదయం.. వరదరాజులు తన భార్యని మామూలు మనిషిని చేయమని దేవుడి దగ్గర వేడుకుంటాడు. అంతలోనే సులోచన అక్కడికి వస్తుంది. నీకు బాగవుతుంది బాధపడకంటూ ధైర్యం చెప్తాడు వరదరాజులు. అపుడే మాళిని ధూపం తీసుకుని వస్తుంది అక్కడికి. ఆ వాసనకు అందరూ దగ్గుతారు. కుర్చీలో కూర్చున్న సులోచన కోపంతో మాళినిని తిడుతుంది. అది విని అందరూ ఆశ్చర్యపోతారు. అమ్మా.. నువ్ మాట్లాడుతున్నావ్ అంటూ వేద కళ్ల వెంట ఆనందభాష్పాలు వస్తాయి. ‘అసలు నేను మళ్లీ బతుకుతానని అనుకోలేదు. నేను లేకపోతే నువ్ ఏమైపోతావోనని బెంగేసింది’ అంటూ బాధపడుతుంది సులోచన. మాళిని, సులోచనలు ఎప్పటిలాగే కావాలని పోట్లాడుతారు. అపుడే యశోధర్ వచ్చి చాలా సంతోషంగా ఉంది అత్తయ్య అంటాడు. కొడుకు లాంటి నువ్ ఉండగా నాకేం అవుతుంది. నీ రుణం ఎలా తీర్చుకోవాలయ్యా.. అంటూ ఎమోషనల్ అవుతుంది సులోచన. ‘అమ్మా నువ్ నాకు ఏదో చెప్పాలని ప్రయత్నించావ్ ఏంటమ్మా’ అని అడుగుతుంది వేద. క.. అంటే కారు. నన్ను వచ్చి గుద్దేసింది నల్ల కారు అంటుంది సులోచన. ఆక్సిడెంట్ జరిగిన తీరును వివరిస్తుంది వేదకి. మిమ్మల్ని ఈ స్థితికి తీసుకువచ్చిన వాడిని వదిలేదే లేదు అత్తయ్య అని మాటిస్తాడు యశ్.
డాడీ.. ఈ రోజు ఆఫీసుకు వెళ్లలేదేంటి అంటూ వస్తుంది ఖుషీ. సండే కదా ఈవ్నింగ్ ఎంజాయ్ చేద్దాం అంటాడు యశ్. ఆ తర్వాత వేద వచ్చి నా కారు సర్వీస్‌కి ఇచ్చాను. మీ కారు కీస్ ఇవ్వండి అంటుంది భర్తని. క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లమని యవ్ సూచించగా.. అందుకు ఒప్పుకోదు వేద. దాంతో ఖుషీని పిలిచి కీస్ ఇప్పించుకుంటుంది వేద. మమ్మీ నువ్ త్వరగా వచ్చేయ్. సాయంత్రం మనం షికారుకు వెళ్లాలి అంటుంది తల్లితో. సరేనంటూ క్లీనిక్‌కి బయల్దేరుతుంది వేద. కారు స్టార్ట్ చేయగానే వెనక్కి తాకి డ్యామేజ్ అవుతుంది. టెన్షన్ పడిన వేద వెంటనే రిపేర్‌కి తీసుకెళ్తుంది. అసలు స్క్రాచెస్ పడినట్లు తెలియకూడదంటుంది మెకానిక్‌తో. పెద్ద పెద్ద ఆక్సిడెంట్లు చేసిన కార్లే నా దగ్గరకు వస్తాయి రండి వచ్చి చూడండిఅంటూ చూపిస్తాడు మెకానిక్. మరి తన తల్లికి ఆక్సిడెంట్ చేసిన కారుని వేద ఎలా గుర్తు పడుతుందో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..