నిన్నటి ఎపిసోడ్‌లో సులోచన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వస్తుంది. సులోచన ఆరోగ్యం కుదుటపడేవరకు నేనే చూసుకుంటానని మాటిస్తుంది మాళిని. అయితే పూర్తిగా కోలుకోని సులోచన తనకు ఆక్సిడెంట్ చేసింది ఎవరో చెప్పే ప్రయత్నం చేస్తుంది. దాంతో వేద కాంచనని నిలదీస్తుంది. ఆ తర్వాత అక్టోబర్ 12 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
కాంచన దగ్గరికి వెళ్లిన వేద కైలాష్ తనతో ఫోన్‌లో ఏం మాట్లాడాడో చెప్పమని నిలదీస్తుంది. నిజం చెప్పకుండా కాంచన నసుగుతుంది. నీ ఫోన్‌లో ఆటోమేటిక్ కాల్ రికార్డు ఉంది.. ఫోన్ ఇస్తే నేనే బయటపెడతానని అడగుతుంది. వేద మాటలకు భయపడి కాంచన నిజం చెప్పేస్తుంది. ‘ఆక్సిడెంట్ చేసింది ఎవరు అని ఏమైనా అనుకుంటున్నారా’ అని కైలాష్ అడిగినట్లు చెప్తుంది కాంచన. అంతే ఆ మాట విని వెంటనే బయల్దేరతారు వేద, యశోదర్లు. ‘ఒరేయ్ అభిమన్యు.. ఎక్కడున్నావ్ రా.. బయటికి రారా’ అని పిలుస్తాడు యశ్. బయటికి వచ్చిన అభిమన్యుని కారు ఎక్కడ? కైలాష్ ఎక్కడ? అని నిలదీస్తాడు. నాకు మొత్తం తెలిసిపోయింది. మా అమ్మకు ఆక్సిడెంట్ చేసింది మీరే. ముందు ఆ కారు, కైలాష్ ఎక్కడున్నారో చెప్తే నిజం తేలుస్తానంటుంది వేద. పోలీసులను పిలుస్తానంటూ బెదిరిస్తాడు అభిమన్యు. పిలువురా.. అంటూ ఇద్దరూ పోట్లాడుకుంటారు. చివరగా ఆక్సిడెంట్ చేసిన ఏ ఒక్కరినీ వదిలేది లేదు అంటూ వార్నింగ్ ఇస్తాడు యశోదర్. మీ అమ్మకు ఆక్సిడెంట్ చేసింది మీమేనని ఫ్రూప్ ఉందా అంటూ దబాయిస్తాడు అభిమన్యు. కైలాష్ దొరికితే అన్నీ బయటపడతాయంటాడు యశ్. బెయిల్ ఇప్పించింది నువ్వే కదా అని యశ్ అడగ్గా.. వారం రోజుల నుంచి కైలాష్ నాకు కనబడలేదంటూ అబద్ధం చెప్పాడు అభి. నీకు దమ్ముంటే ఫ్రూఫ్ చేయ్ అని సవాల్ విసురుతాడు అభిమన్యు. జైలుకెళ్లి ఊచలు లెక్కపెట్టడానికి రెడీగా ఉండని ప్రతిసవాల్ విసురుతాడు యశ్. అలా ఇద్దరి మధ్య కాసేపు మాటల యుద్దం కొనసాగుతుంది.
సీన్ కట్ చేస్తే.. ఖుషి అమ్మమ్మా.. అని సులోచన దగ్గరకు వెళ్తుంది. నువ్వంటే నాకు బోలెండ ఇష్టమని తన ప్రేమనంతా చూపిస్తుంది. నువ్ ఇలా బెడ్ మీద కూర్చుంటే నాకు బాలేదమ్మమ్మా.. నన్ను ఖుషి తల్లి అని పిలువు అని వేడుకుంటుంది. అంతలోనే అక్కడకు వచ్చిన మాళిని.. కావాలనే సులోచనను చెడామడా తిడుతుంది. సులోచనకు కోపం రావాలని.. తన కోపం, పగ తీర్చుకుంటానని చెప్తుంది మాళిని. గతం నుంచి సులోచనపై ఉన్న కోపాన్నంతా తన ముందుంచుతుంది. చెడామడా తిడుతుంది. చేతనైతే తిరిగి తిట్టమని అంటుంది. దమ్ముంటే లేచి నిల్చో.. ముద్దపప్పు అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది మాళిని. దాంతో సులోచన కోపంతో రగిలిపోతుంది. మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. చివరకు మాళినిని పిప్పళ్ల బస్తా అని తిట్టి కళ్లుమూసుకుంటుంది. ఒకప్పుడు నువ్ తిడితే కోపం వచ్చేది.. ఇపుడు నువ్ తిడితే సంతోషంగా ఉందంటూ ఎమోషనల్ అవుతుంది మాళిని.
ఆ తర్వాత సీన్‌లో యశోదర్‌కు తన ఫ్రెండ్ ఫోన్ చేసి వేదని తీసుకుని పార్టీకి రమ్మని పిలుస్తాడు. యశ్ ఏం చెప్పినా వినకుండా రావాల్సిందేనని బెట్టు చేస్తాడు తను. ఈ పరిస్థితుల్లో వేదని ఎలా అడగాలి అని మనసులో అనుకుంటాడు. కానీ వేదని అడిగే ప్రయత్నం చేస్తాడు ధైర్యంగా. ఇపుడు వెళ్లడం కరెక్ట్ కాదండీ అంటుంది వేద. అత్తయ్యకు ఆక్సిడెంట్ అయినప్పటి నుంచి నువ్ ఎంత టెన్షన్ పడ్డావో చూస్తున్నా. ఇలా వెళ్తే నీకు రిలాక్స్‌గా ఉంటుందంటాడు యశ్. నాకంటే ఎక్కువ టెన్షన్ పడింది మీరు.. మీరు రిలాక్స్ కావాలి. మీకోసమైనా ఈ రోజు పార్టీకి వెళ్దాం అంటుంది వేద.
వేద, యశోదర్‌లు పార్టీకి వెళ్తారు. అక్కడ హ్యాపీగా స్పెండ్ చేస్తారు ఇద్దరూ. అంతలోనే అక్కడికి వచ్చేస్తుంది మాళవిక. వేద, మాళవికలు ఒకరినొకరు అసూయగా చూసుకుంటారు. అక్కడ ఇద్దరి మధ్య మళ్లీ ఏం పోట్లాట జరుగుతుందో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..