ఆస్పత్రిలో ఉన్న సులోచన దగ్గరికి పోలీసులు వస్తారు. పేషెంట్ స్పృమలోకి వచ్చిన వెంటనే వాంగ్మూలం తీసుకుని ఆక్సిడెంట్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేస్తామని చెప్తారు. మరోవైపు సులోచనని స్పృహలోకి రప్పించేందుకు మాళిని తన మాటలతో కోపం తెప్పించే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత అక్టోబర్ 10 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
సులోచన దగ్గర మాళిని భరతనాట్యం చేస్తూ ఏడుస్తుంది. దాంతో సులోచన స్పృహలోకి వస్తుంది. అది గమనించి వేద అందరికి చూపిస్తుంది. మీరు ఇంకా ఇలానే మాట్లాడండి అత్తయ్య అంటూ ప్రోత్సహిస్తుంది వేద. దాంతో మాళిని సులోచనని తిడుతుంది కావాలని. కళ్లు తెరిచిన సులోచనని డాక్టర్ వచ్చి చెక్ చేస్తుంది. థ్యాంక్ గాడ్.. ఈవిడ స్పృహలోకి వచ్చింది. గండం గడిచింది అని గుడ్ న్యూస్ చెప్తుంది. ఇపుడు మా ట్రీట్‌మెంట్‌తో పూర్తిగా నయమవుతుంది. అసలు ఈ మిరాకిల్ ఎలా జరిగింది అని అడగ్గా.. ఇదంతా మా అత్తయ్య వల్లే జరిగిందని అంటుంది వేద. మీరు పేషెంట్‌కి ప్రాణస్నేహితులా అని మాళిని అడగ్గా.. లేదు బద్ధ శత్రువులమని వివరిస్తుంది మాళిని. మళ్లీ కళ్లు మూసుకుంటుంది సులోచన. డాక్టర్ అందర్నీ పంపించి మళ్లీ ట్రీట్‌మెంట్ చేస్తుంది.
సీన్ కట్ చేస్తే.. వరదరాజులు బిల్ పే చేయడానికి ఇబ్బంది పడతాడు. అది గమనించిన యశోదర్ మొత్తం బిల్ నేను కడతా ఆయన్ని ఇబ్బంది పెట్టొద్దని అంటాడు రిసెప్షన్ దగ్గర. అయ్యో వద్దు బాబు అని వరదరాజులు అనగా.. నన్ను పరాయి వాడిని చేయొద్దు మామయ్య. నేనే మీకు కొడుకునైనా.. అల్లుడినైనా. అక్కడ ఉంది మా అత్తయ్య కాదు మా అమ్మ అంటాడు మామయ్యతో. దాంతో వరదరాజులు సంబరపడిపోయి అల్లుడిని కౌగిలించుకుంటాడు. యశోదర్ ఆస్పత్రిలో బిల్ అంతా కట్టేస్తాడు. అది చూసి వేద ఆనందంతో ఉప్పొంగిపోతుంది. ఆ తర్వాత ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్తుంది. ఖుషీ అమ్మమ్మకు ఎలా ఉందంటూ తల్లిని ఆరా తీస్తుంది. అమ్మమ్మకు నయమైందని వేద చెబుతుంది ఖుషీతో. నేనొకసారి అమ్మమ్మని చూడాలనగా.. పిల్లలు అక్కడికి రాకూడదంటుంది వేద. నువ్ అమ్మమ్మ దగ్గర ఉండకుండా ఎందుకు వచ్చావ్ అమ్మా అంటే.. అమ్మమ్మకు ఆకలిగా ఉందంటే తీసుకెళ్లడానికి వచ్చానని చెబుతుంది కూతురితో..
ఆ తర్వాత వేద సోఫాలో తల్లి ఉన్నట్లు ఊహించుకుంటుంది. సులోచనని గుర్తు చేసుకుని బాధపడుతుంది. అమ్మవారి రక్షాబంధన్‌ని అమ్మమ్మ చేతికి కట్టమని ఇస్తుంది ఖుషి. కూతురి మాటలు విని కౌగిలించుకుంటుంది వేద ప్రేమగా. ఆ తర్వాత సీన్‌లో కైలాష్ కాంచనకు ఫోన్ చేసి వేద అమ్మ ఎలా ఉందని ఆరా తీస్తాడు. వేద, యశోదర్‌లు ఏమనుకుంటారని అడుగుతాడు భార్యని. ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్తాడు కాంచనకు. అపుడే వస్తుంది వేద అక్కడికి. ఫోన్ ఎవరు వదిన అని అడగ్గా.. నా ఫ్రెండ్ అని చెప్పి కవర్ చేస్తుంది. ‘అవును నువ్ ఎక్కడికి అమ్మకి ఎలా ఉంది అని అడుగుతుంది’ కాంచన నటిస్తూ.
సీన్ కట్ చేస్తే.. వేద ఆస్పత్రిలో ప్రత్యక్షమవుతుంది. ‘అమ్మా ఎంత బాధగా ఉందో తెలుసా.. కానీ ప్రమాదం తప్పింది. నువ్ మామూలు మనిషివి అయితావు’ అని తల్లితో తన బాధ చెప్పుకుంటుంది. నీ గురించి నీ మనవరాలు ఖుషీ తాపత్రయపడుతుంది. దేవుళ్లకు దండం పెట్టుకుంటుంది. నీకు కట్టమని అమ్మవారి రక్ష పంపించిందని చెప్పి సులోచన చేతికి కడుతుంది. ఆ తర్వాత వేద బయటికి రాగా అక్కడ యశోదర్ ఒంటరిగా కనిపిస్తాడు. ‘ఏమైంది ఇక్కడ కూర్చున్నారు’ అని భర్తని అడగ్గా… ఏం లేదు నువ్ కూడా వచ్చి కూర్చో అంటాడు యశ్. టిఫిన్ బాక్స్ తీసి భర్తకు ఇచ్చి తినమంటుంది ప్రేమగా. ఆ తర్వాత ఏం జరగనుందో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..