ఖుషిని ఒప్పించి పిక్నిక్ పంపిస్తుంది వేద. అక్కడ మాళవిక కూడా ఆదిత్యతో కలిసి వెళ్తుంది. అక్కడ పిల్లలిద్దరు కలిసి సరదాగా ఆడుకుంటారు. ఖుషి మాళవికకు పంచ్‌ల మీద పంచ్‌లు వేస్తుంది. కలిసి పెరగాల్సిన పిల్లలు నీ వల్లే వేర్వేరుగా పెరుగుతున్నారని యశ్ మాళవిక మీద అరుస్తాడు. ఆ తర్వాత నవంబర్ 9 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
పిక్నిక్ వెళ్లిన ఖుషిని తలుచుకుంటూ బాధపడుతుంది వేద. చిత్ర, వసంత్‌లు బయట కలుసుకుని ఎంజాయ్ చేస్తారు. అక్కడికే యశ్ లాయర్ కూడా వస్తాడు. ఒక వ్యక్తి వచ్చి సీసీటీవీ ఫుటేజికి సంబంధించిన పెన్‌డ్రైవ్ ఇస్తాడు. అది తీసుకున్న తర్వాత లాయర్ యశోధర్‌కు ఫోన్ చేసి విషయం చెప్తాడు. దాంతో యశ్ హ్యాపీగా ఫీలవుతాడు. ఖుషికి వేదని శాశ్వతంగా దూరం చేస్తానని మాళవిక ఆదిత్యతో చెప్పడం చాటుగా వింటుంది ఖుషి.
ఆ తర్వాత సీన్‌లో చిత్ర వేద దగ్గరికి పరుగున వెళ్తుంది. ఏదో జరుగుతుంది అక్కా.. అని లాయర్ మాట్లాడిన విషయాలన్నీ చెప్తుంది. మన బావ గారు ఫుటేజిని ఎందుకు డిస్ట్రాయ్ చేయాలనుకుంటున్నాడు? అర్థం కావట్లేదంటుంది చిత్ర. జరిగిందంతా చెప్పిన వేద భర్తనే నమ్ముతుంది. అసలు ఆయన అలాంటి పని ఎందుకు చేస్తారు. రోడ్డు మీద నెత్తుటి మడుగులో పడివున్న అమ్మని కాపాడింది ఆయనే కదా.. ట్రీట్‌మెంట్ చేయించడానికి రాత్రిబంవళ్తు కష్టపడింది ఆయనే కదా.. ఆక్సిడెంట్ చేసిన వాళ్లని పట్టుకుంటానని అమ్మకు నాకు మాటిచ్చింది ఆయనే కదా.. అలాంటిది ఆయన తప్పు ఎలా చేస్తారు. నీకేమైనా మతి ఉండే మాట్లాడుతున్నావా? అని చిత్ర మీదికే రివర్స్ అవుతుంది వేద. నా భర్త మీద నాకు నమ్మకం ఉంది ఆయనను అనుమానించను నువ్ వెళ్లు అంటూ చిత్రను పంపించేస్తుంది.
సీన్ కట్ చేస్తే.. ఆది, ఖుషిలు పేరేంట్స్‌తో కలిసి పిక్నిక్‌లో గేమ్స్ ఆడుతారు. అక్కడ ఖుషి వేదని డాడీతో కలిసి గుర్తుచేసుకుంటుంది. యశోధర్ కళ్లకు మాళవిక క్లాత్ కడుతుంది. కళ్లు మూసుకున్న యశ్ తనని పట్టుకున్నట్లు కలగంటుంది మాళవిక. కానీ తను అనుకున్నది జరగకుండా చేస్తుంది ఖుషి. దాంతో మాళవిక వేదని ఆడిపోసుకుంటుంది. పిక్నిక్ అయ్యేలోపు ఎలాగైనా తనవైపు తిప్పుకుంటానంటుంది. ఆ తర్వాత యశ్ గది అద్దెకు తీసుకోవడానికి వెళ్తాడు. అక్కడ మేం భార్యాభర్తలం కాదని చెప్తాడు రిసెప్షన్ దగ్గర. దాంతో మూతి వంకరగా తిప్పుకుంటుంది మాళవిక. రూంలోకి వెళ్లేముందు అందరూ కలిసి సెల్ఫీ దిగుతారు. ఆ పిక్‌ని మాళవిక డీపీగా పెట్టుకుంటుంది. కేవలం ఇధ్దరి కోసమే ఇలా చేస్తున్నానుకుంటుంది. ఈ ఫోటో చూసి అభి, వేద కుళ్లుకోవాలి అనుకుంటుంది. ఈ మాళవిక అంటే ఏంటో ఆ వేదకు చూపిస్తా అనుకుంటుంది మనసులో. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..