నిన్నటి ఎపిసోడ్‌లో మాళవిక యశోధర్ దగ్గరికి వచ్చి తనని బ్లాక్‌మెల్ చేస్తుంది. అపుడు యశ్ కూడా అంతే స్థాయిలో రిప్లై ఇస్తాడు. మాళవికని తోటలో కలుపుమొక్కలాగా తీసిపారేస్తాడు. ఆక్సిడెంట్ చేసింది ఆది అని నాకు తెలుసు అందుకే తనని కాపాడాలనుకుంటున్నానని చెప్తాడు. ఆ తర్వాత నవంబర్ 23 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
మాళవిక వెళ్లిపోయన తర్వాత వేద లంచ్ బాక్స్ తీసుకుని భర్త చాంబర్‌కి వెళ్తుంది. కలిసి తిందాం వేద కూర్చోమంటాడు యశ్. కానీ వేద క్లినిక్ వెళ్తున్నానని చెప్పి పోతుంది. వెనకాల వచ్చి వేదని నిలదీస్తాడు యశ్. మాళవికకి కోర్టు నుంచి సమాన్లు రావడం ఏంటని ప్రశ్నిస్తాడు. తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చేస్తానంటుంది వేద మొండిగా. అలాగే ఇద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం నడుస్తుంది. నేను మిమ్మల్ని నమ్మి మీతో నిజాయితీగా ఉన్నా. తప్పుడు పని చేసిన మనిషిని మీరు తప్పిస్తానంటే నేను ఊరుకోనని తేల్చి చెప్తుంది వేద.
సీన్ కట్ చేస్తే.. మాళవికని వసంత్ ఎందుకు వచ్చావ్ అంటూ ప్రశ్నిస్తాడు. యశోధర్ నా భర్త. ఎప్పుడైనా వచ్చే అధికారం నాకుంది అంటూ పొగరుగా సమాధానం ఇస్తుంది మాళవిక. నీకు మా అన్న విడాకులు ఇచ్చావ్. మా వదిన వేద అంటూ అంతే స్థాయిలో రిప్లై ఇస్తాడు వసంత్. ఆ తర్వాత వేద, మాళవికలు అనుకోకుండా ఒకే లిఫ్ట్‌లో కలుస్తారు. హలో డాక్టర్ వేద.. ఈ టైంలో ఇక్కడేంటి అని ప్రశ్నిస్తుంది మాళవిక. నువ్ ఎందుకు వచ్చావని వేద అడగ్గా.. మా ఆయన దగ్గరికి వచ్చానంటుంది మాళవిక. ఆ తర్వాత ఇద్దరు సవతులు పోట్లాడుకుంటారు. నిన్ను జైలుకు పంపిస్తానని వేద చెప్పగా.. నన్ను కాపాడేందుకు మిస్టర్ యశోధర్ అనే ఒక కవచం ఉందని గర్వంగా చెప్తుంది మాళవిక. యశ్ నా చేతిలో కీలు బొమ్మ. ఖుషి, ఆది నా పిల్లలు. యశ్ నా భర్త అంటూ వేదని రెచ్చగొడుతుంది మాళవిక. దేవుడనే వాడు ఉన్నాడు. నిన్ను మధ్యలోనే ఆపేస్తాడని వేద చెప్తుండగానే లిఫ్ట్ మధ్యలో ఆగిపోతుంది. ఏం నోరే నీదని కోపంగా అరుస్తుంది మాళవిక వేద మీదికి.
హెల్ప్ చేయమని మాళవిక అరుస్తుంది. వసంత్‌కి ఫోన్ చేసి ఎలక్ట్రిషియన్‌ని పిలిపించమని చెప్తుంది. ఆ తర్వాత వేద కూడా వసంత్‌కి ఫోన్ చేస్తుంది. ఎందుకు నీకు చెమటలు పడుతున్నాయి. రేపు కోర్టులో నా చేతిలో ఓడిపోతున్నందుకు నీకు చెమటలు పడుతున్నాయని హెచ్చరిస్తుంది వేద. అంతలోనే యశ్, వసంత్‌లు లిఫ్ట్ దగ్గరికి వెళ్తారు. వేదని చేయి అందించమని యశ్ అడగ్గా.. వసంత్‌ని పిలిచి చేయి పట్టుకుని దిగుతుంది. వసంత్ వెళ్లి వేదకు ధైర్యం చెప్తాడు. నేను నీకే సపోర్ట్ వదిన అంటాడు. మీ ఇద్దరి బంధం శాశ్వతం వదిన అంటూ వేదని ఓదార్చుతాడు. ఆ తర్వాత వేద ఏడుస్తూ క్లినిక్‌కి బయల్దేరుతుంది. ఇక్కడ ఆఫీసులో యశ్ కూడా వేదని తలుచుకుంటూ బాధపడతాడు.
సీన్ కట్ చేస్తే.. లాయర్ ఝాన్సీ వేదకు గుడ్ న్యూస్ చెప్తుంది. సీసీటీవీ ఫుటేజి మాయం చేసినా కొన్ని ఆధారాలు దొరికాయి. అవతలి పార్టీ వాళ్లకు ఊహించని షాక్ ఇవ్వబోతున్నానంటుంది ఝాన్సీ. క్రిమినల్ ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోకూడదు. న్యాయం గెలవాలని అంటుంది వేద. ఆ తర్వాత వసంత్ యశ్ దగ్గరికి వెళ్లి నువ్ నాకు నచ్చడం లేదంటాడు. నేను, చిత్ర మిమ్మల్ని రాముడు, సీతల ఆరాధిస్తాం అంటాడు. అక్కడ చిత్రకు వేద సారీ చెబుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం..