కొడుకు మీద చేయి చేసుకున్నందుకు బాధపడుతుంది మాళిని. టిఫిన్ తినకుండా వెళ్లాడని చెప్పడంతో అత్తయ్యని ఓదారుస్తుంది వేద. అక్కడ మాళవికకు కోర్టు నుంచి సమాన్లు వస్తాయి. దాంతో అభి మీద మండిపడుతుంది మాళవిక. దీనంతటికీ కరెక్ట్ పర్సన్ యశోధరే అనుకుంటూ ఆఫీస్‌కి వెళ్తుంది. ఆ తర్వాత నవంబర్ 22 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
భర్త మీద పీకలదాకా కోపం ఉన్నా అత్తయ్య కోసం లంచ్ తీసుకుని ఆఫీసుకు వెళ్తుంది వేద. భర్తను ఉద్దేశించి తనలో తానే మాట్లాడుకుంటుంది వేద. అక్కడ మాళవికకు యశోధర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తాడు. ఆదిని అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెల్ చేస్తున్నావంటూ మాజీ భార్య మీదికి అరుస్తాడు. అసలు ఈ ఆక్సిడెంట్ చేసింది నువ్ కాదు 12ఏళ్ల కుర్రాడు ఆదిత్య. నాకు ఇదంతా తెలియదనుకున్నావా? అంటూ టాపిక్ డైవర్ట్ చేస్తాడు యశోధర్. ఆక్సిడెంట్ నువ్వే చేశావని నమ్మేశా.. అంటూ ఆదిత్య చెప్పిన అసలు నిజం చెప్తాడు యశోధర్. పన్నేండేళ్ల నా మైనర్ కొడుకు ఆ రోజు డ్రైవ్ చేసి ఆక్సిడెంట్ చేశాడు. అలా చేయడానికి కారణం నువ్వూ, ఆ అభిమన్యునే అంటూ మాళవిక మీదికి ఫైర్ అవుతాడు. డ్ర్రైవర్ వద్దని చెప్పినా వినకుండా ఆదిత్య కారు నడిపి ఆక్సిడెంట్ చేసిన సీన్‌ని గుర్తుచేస్తాడు యశోధర్. నిజం దాచి తప్పు చేశావని యశోధర్ క్లాస్ పీకుతాడు. నా కొడుకు కోసం చేశానని మాళవిక చెప్తుండగా అదంతా అబద్ధం అని వారిస్తాడు యశ్. ఆక్సిడెంట్ చేసి వేదని టార్చర్ చేసి నా నుంచి దూరం చేద్దామనుకున్నావ్? అభిమన్యుని లొంగదీసుకోవాలనుకున్నావ్? ఇదంతా నిజం కాదా అని మాజీ భార్యని నిలదీస్తాడు యశ్.
సీన్ కట్ చేస్తే.. వేద భర్త మీద ఉన్న తన ఫీలింగ్స్‌ని చెప్పుకుంటుంది. భార్యలకు భర్తలంటే ఎందుకు ఇంత ఇష్టమో ఇపుడే అర్థం అవుతుంది. నీకోసం వస్తున్నా అంటూ లంచ్ తీసుకుని కారులో బయల్దేరుతుంది వేద. అక్కడ మాళవికతో యశోధర్ వేదకు చేసిన అన్యాయాన్ని చెప్తూ బాధపడతాడు. ‘అందరూ నేను మళ్లీ నీతో కలిసి తిరుగుతున్నానని అనుకుంటున్నారు. కానీ ఎలా చెప్పేది వాళ్లకి. నేను కాపాడుతున్నది నిన్ను కాదు నా పన్నేండేళ్ల కొడుకుని. వాడు కారు నడపడం చట్టరిత్యానేరం. వాడు తప్పు చేస్తున్నా వద్దని చెప్పని తల్లివి నువ్. డిజైనర్ బట్టలు వేసుకుని అందంగా తయారై మొగుడు కానీ మొగుడితో పబ్బులు పార్టీలకు తిరిగే నువ్వూ ఓ తల్లివా? నీ జల్సాల కోసం పిల్లల్ని గాలికి వదిలేసిన నువ్ ఆడదానివేనా? అంటూ మాళవిక పరువు తీస్తాడు యశోధర్. నీవల్లే తండ్రి స్థానంలో ఉండి వేద ముందు తలెత్తుకోలేకపోతున్నా. నేను తప్పు చేస్తున్నా. వేద నన్ను జీవితంలో క్షమించదు. ఐ లాస్ట్ వేద ఫరెవర్ అంటూ అరుస్తాడు’ యశోధర్.
అపుడు నీకు ఆ వేద ఏదో మందు పెట్టింది.. మరి మా సంగతేంటి అంటూ మళ్లీ యశ్‌ని నిలదీస్తుంది మాళవిక. ఇప్పుడే వెళ్లి నీకు మీ నాన్న ఇచ్చిన మాట తప్పాడు. నీకు ఇక మీ నాన్న లేడని చెప్పేస్తా అంటూ యశ్‌ని బెదిరిస్తుంది. చంపేస్తా నిన్ను అంటూ చేయి ఎత్తుతాడు యశ్. నా కొడుకుకు నాకు మధ్య చిచ్చు పెట్టాలనుకుంటే చంపేస్తా నిన్ను అంటూ వార్నింగ్ ఇస్తాడు. నా కొడుకును ఎలాగైనా కాపాడుకుంటానని మాటిస్తాడు యశ్. ఆది తరపున ఫైట్ చేసి తండ్రిగా నాకొడుకును కాపాడుకోవడం నా బాధ్యత. మొత్తం ప్రపంచమే నన్ను తప్పుపట్టి ఛీ కొట్టినా సరే ఆది కోసం అన్నీ భరిస్తా అంటూ హామీ ఇస్తాడు యశోధర్. వేద చాలా మంచిది. ఓపికతో చెప్తే అన్నీ అర్థం చేసుకుంటుంది అని యశోధర్ చెప్తుండగానే నో.. నో అంటూ అరుస్తుంది. వేదని నమ్మలేను.. ఒక ఆడదాని బుద్ధి ఇంకో ఆడదానికే తెలుస్తుంది. యశ్ ప్లీజ్.. ఈ ఒక్కసారి నాకు సహాయం చేయ్ అంటు బతిలాడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వేదకు నిజం చెప్పకూడదని వేడుకుంటుంది. దాంతో సరేనని మాళవికకు ప్రామిస్ చేస్తాడు యశ్. ఆదికేం కానివ్వకూడదని చెప్పి వెళ్లిపోతుంది మాళవిక.
మాళవిక ఎగ్జిట్ అవుతుండగానే వేద యశ్ చాంబర్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. వేదని చూసి రా వేద అంటూ ప్రేమగా పిలుస్తాడు యశ్. మరి భార్యతో యశ్ నిజం చెప్తాడా లేదా తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..