ఆక్సిడెంట్ కేసును వేద లాయర్ ఝాన్సీకి అప్పచెప్తుంది. దాంతో యశోధర్‌లో భయం పెరిగిపోతుంది. కొడుకు నిజస్వరూపం తెలిసి చెంపపగలగొడుతుంది మాళిని. తను చేస్తుంది తప్పని నిలదీస్తుంది. వేదకు సపోర్ట్ చేసి అండగా నిలుస్తారు అందరూ. ఆ తర్వాత యశ్ కేసు విత్‌డ్రా చేసుకోమని భార్యని కోరతాడు. కానీ వేద ఒప్పుకోదు. ఆ తర్వాత ఏం జరిగిందో నవంబర్ 21 ఎపిసోడ్‌లో చూద్దాం..
వేద, యశోధర్‌ల మధ్య కాసేపు రొమాంటిక్ సీన్ నడుస్తుంది. నా మీద పీకల దాకా కోపం ఉన్నా వేద నన్నే గమనిస్తుందని మనసులో ఉప్పొంగిపోతాడు యశోధర్. ఆ తర్వాత మాళిని కొడుకును కొట్టినందుకు బాధపడుతుంది. నేనేం చేసినా వాడి సంతోషం కోసమే కదా అనుకుంటూ వెళ్లి యశ్‌ని టిఫిన్ చేయమని పిలుస్తుంది. నాకు ఆకలి లేదంటూ వెళ్లిపోతాడు యశ్. సీన్ కట్ చేస్తే.. మాళవికకు పెళ్లి ప్రపోజల్ చేస్తాడు అభి. దాంతో థాంక్యూ బంగారం అని సంబరపడిపోతుంది మాళవిక. అంతలోనే సెక్యూరిటి వచ్చి కోర్టుకు హాజరు అవమని వచ్చిన నోటీసును మాళవికకు ఇస్తాడు. దాంతో అంతా నీ వల్లే అంటూ అభి మీద మండిపడుతుంది మాళవిక. సారీ బంగారం అని చెప్పినా మాళవిక కోపం తగ్గదు. బెస్ట్ లాయర్‌ని పెట్టి కేసు గెలిచేలా చేస్తానని మాటిస్తాడు అభి. ఖుషి కేసులో కూడా నువ్ ఇలానే చేశావ్. ఇపుడు నేను నిన్ను నమ్మను. దీనికి యశోధరే కరెక్ట్ పర్సన్ అంటూ యశ్ దగ్గరికి వెళ్తుంది మాళవిక.
ఆ తర్వాత సీన్‌లో ఆఫీసు పని గురించి వసంత్ మీద అరుస్తాడు యశ్. మాళవిక వచ్చి నీతో అర్జెంటుగా మాట్లాడాలి యశ్ అంటుంది. వసంత్‌ని అక్కడినుంచి పంపిస్తాడు యశ్. అక్కడ మాళిని దిగులుగా కూర్చుంటుంది. వేద పలకరిస్తుంది అత్తయ్యని. యశ్‌తో మాట్లాడింది తలుచుకుంటూ బాధపడుతుంది మాళిని. ఎప్పుడూ తప్పు చేయని నా కొడుకు మొదటిసారిగా ఇలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కావట్లేదంటూ మదనపడుతుంది. తప్పు చేసే పిల్లలు ఉంటారేమో కానీ తప్పు చేసే తల్లి ఉండదు. మీరు చేసింది తప్పేం కాదంటూ మాళినిని ఓదారుస్తుంది వేద. ఎదిగిన కొడుకు మీద చేయి చేసుకునే పరిస్థితి ఏ తల్లికి రాకూడదంటూ కన్నీరు పెట్టుకుంటుంది మాళిని. యశ్ ఏం తినకుండా వెళ్లాడని మాళిని అనడంతో మీరు వండిన భోజనం తీసుకెళ్లి నేను ఆయనకు పెడతానంటుంది వేద. థాంక్యూ వేద అంటూ కోడల్ని పొగడుతుంది మాళిని.
సీన్ కట్ చేస్తే.. ఏం జరిగిందని ఇక్కడిదాకా వచ్చావ్ అంటూ మాళవిక మీదికి అరుస్తాడు యశ్. మొత్తం నేనే చూసుకుంటానని గొప్పలు చెప్పావ్ కదా.. మరి ఈ కోర్టు సమాన్ ఏంటని యశ్‌ని నిలదీస్తుంది. లక్కీగా ఆ టైంలో ఆది లేడు ఉండి ఉంటే ఏం జరిగేదని ప్రశ్నిస్తుంది. ఎందుకు ఇక్కడికి వచ్చావ్.. ఆ లోఫర్ అభిమన్యుని అడుగు అంటూ మాళవిక మీదికి ఫైర్ అవుతాడు యశ్. అంతా నా కర్మ అంటూ ఆదిని అడ్డు పెట్టుకుని మళ్లీ యశ్‌ధర్‌ని రెచ్చగొడుతుంది మాళవిక. మమ్మల్ని నడి రోడ్డుమీద వదిలేస్తే మా పరిస్థితేంటి అంటూ యశ్‌ని రిక్వెస్ట్ చేస్తుంది మాళవిక. అపుడు గతంలో తనని వదిలేసి వెళ్తూ మాళవిక మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటూ యశోధర్. నువ్ ఇపుడు మాట్లాడుతుంటూ దెయ్యం మాట్లాడుతున్నట్టుంది. ఆదిని అడ్డం పెట్టుకుని నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నావంటూ కోప్పడతాడు యశ్. అరుస్తున్న మాళవికను షటప్ అంటూ ఫైర్ అవుతాడు యవ్.
అసలు ఈ ఆక్సిడెంట్ వెనక ఉన్న రహస్యం ఏంటో నాకు తెలుసు. ఈ ఆక్సిడెంట్ చేసింది నువ్ కానే కాదు ఆదిత్య అంటూ వేదని చూసి మాట మారుస్తాడు యశోధర్. మరి నిజానిజాలేంటో వేద తెలుసుకుంటుందా? లేదా తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..