మాళవికను ఇంట్లో వదిలేసి వస్తుండగా యశోధర్‌కు అభిమన్యు ఎదురుపడుతాడు. ఆ తర్వాత అభి ముందు మాళవిక మాజీభర్తని కొనియాడుతుంది. మరోవైపు ఇంటికెళ్లిన యశోధర్‌కు మాళిని క్లాస్ పీకుతుంది. తన భర్తను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదంటూ వేద యశ్‌ని లోపలికి తీసుకెళ్తుంది. ఆ తర్వాత నవంబర్ 1 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
వేదా.. నన్నేమి అడగాలనిపించడం లేదా నీకు అని యశోధర్ అనగానే వేద నిలదీస్తుంది. హోటల్ గదుల్లో గడుపుతున్నారంటూ బాధపడుతుంది. మనం చూసేవి వినేవి నిజాలు కాదని యశోధర్ చెప్పిన వినిపించుకోదు వేద. సంజాయిషి ఇచ్చేందుకు ఎంత ప్రయత్నించినా వేద వినదు. ఆది కోసం మాళవికతో కలిసి స్పెండ్ చేయాల్సి వస్తుంది అంటూ ఇన్‌డైరెక్ట్‌గా చెప్తాడు యశ్. ఇప్పుడు కాకపోయినా ఏదో ఒకరోజు నీకు చెప్తా అంటాడు. ఇప్పుడు మీకు మాళవికనే కావాలి నేను అక్కర్లేదు అంటూ ఎమోషనల్ అవుతుంది. మీ భార్యకు మీరిచ్చే గౌరవం ఇదేనా. ఇదేనా మన బంధం అంటూ నిలదీస్తుంది.
‘భార్య అన్న పదం మీదే నాకు నమ్మకం లేదు. నమ్మకం పోయేలా చేసింది ఆ మాళవికనే. నేను నిన్ను పెళ్లి చేసుకుంది నాకు భార్య కావాలని కాదు. నాకు బిడ్డ కావాలని. ఖుషికి అమ్మగానే నువ్ నా లైఫ్‌లోకి వచ్చావ్. అమ్మగానే ఉండిపో. అదే మన ఒప్పందం’ అంటాడు భార్యతో. అంటే నాకంటూ ఎమోషన్స్ ఉండవా అని భర్తని అడిగినా.. అర్థం చేసుకో అంటాడు యశ్. మనిద్దరి పెళ్లి కేవలం ఖుషీ కోసమే జరిగింది. మనిద్దరి మధ్య ఒక లక్ష్మణరేఖ ఉంది వేద. అది గుర్తుపెట్టుకో అని వెళ్లిపోతాడు. ఆ మాటతో వేద గుండె పగిలిపోతుంది. ఒంటరిగా బాధపడుతూ యశోధర్ మనసులోనే ‘నన్ను క్షమించు వేద. నీకేం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు’ అనుకుంటూ బాధపడతాడు.
మరుసటి రోజు ఉదయం సులోచన ఇంటిబయట ముగ్గు వేసేందుకు భర్తతో యుద్ధం చేస్తుంది. అంతలోనే మాళిని వచ్చి నా కోడలి ఇల్లు, నా ఇష్టం అని ముగ్గు వేస్తానంటుంది. సరదాగా పాట పాడుతూ మాళిని ముగ్గు పెడుతుంది. సులోచన, మాళినిలు ఎప్పటిలాగే సరదాగా పోట్లాడుకుంటారు. వరదరాజులు, రత్నం ఇద్దరి పోరు భరించలేక భార్యలకు చేతులెత్తి దండం పెడతారు.
ఆ తర్వాత సీన్‌లో వేద భర్త మాటల్ని తలుచుకుంటూ బాధపడుతుంది. అంతలోనే యశ్ వచ్చి వేదని కాఫీ అడుగుతాడు. బాధలో ఉన్న వేద ఏం మాట్లాడకుండా మౌనంగా తన పని తాను చేసుకుంటుంది. దాంతో అక్కడే ఉన్న ఖుషీ ఏం అర్థం కాక ‘నాన్నా ఏమైంది’ అని అడుగుతుంది. అపుడు జరిగింది గుర్తుతెచ్చుకుంటాడు యశ్. చిన్న గొడవ అని కూతురికి చెప్పడంతో వెళ్లి మమ్మీకి సారీ చెప్పమంటాడు. తప్పక యశ్ కిచెన్‌లోకి వెళ్తాడు. యశ్ మాటల్ని పట్టించుకోకుండా వేద కాఫీ తెచ్చి బయటపెడుతుంది. నాన్నా కాఫీ తాగేసి వెళ్లి మమ్మీకి సారీ చెప్పమంటుంది ఖుషీ. ‘రాత్రి జరిగిన దానికి బాగా హర్ట్ అయినట్టుంది. వెళ్లి సారీ చెప్తా’ అనుకుంటాడు యశ్.
సీన్ కట్ చేస్తే.. అభి మాళవికతో ఈరోజు మనం కలిసి బయటికి వెళ్దాం బంగారం అంటాడు. సరే డార్లింగ్ అని మాళవిక చెప్పిన తర్వాత మాళవికకు కేసు గురించి ఫోన్ వస్తుంది. యశ్‌తో మీటింగ్ ఉంది. షాపింగ్ తర్వాత అంటూ అభికి చెప్పేసి వెళ్లిపోతుంది మాళవిక. దాంతో అభికి దిమ్మతిరుగుతుంది. మాళవిక అంతు చూస్తానని మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..