సులోచన ఆక్సిడెంట్ జరిగింది తలుచుకుంటూ ఇంకా బాధపడుతుంది. దాంతో డాక్టర్ తనని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తుంది. తన తల్లికి ఆక్సిడెంట్ చేసిన వాళ్లని ఎలాగైనా శిక్షించాలని అనుకుంటుంది వేద. ఒక లాయర్‌ని ఇంటికి పిలిపించి కేసు గురించి వివరిస్తుంది. దాంతో యశోధర్‌లో కంగారు పెరిగిపోతుంది. తన లాయర్‌కు ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు. ఆ తర్వాత నవంబర్ 18 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
కేసుని లాయర్ ఝాన్సీ టేకప్ చేయడంతో యశోధర్ భయపడిపోయి పరమేశ్వర్‌కు ఫోన్ చేసి చెప్తాడు. లాయర్ పేరు చెప్పగానే తను కూడా కంగారుపడతాడు. మాళవికని ఎలాగైనా కాపాడాలని యశోధర్ చెప్తున్న మాటల్ని వింటుంది మాళిని. కొడుకుని కోపంగా చూస్తుంది. ఆ తర్వాత నిన్న రాత్రి జరిగిందాని గురించి తనకెందుకు చెప్పాలని చిత్ర మీద అరుస్తుంది సులోచన. నా కూతురు జీవితం కోసం ఏదైనా చేస్తానంటుంది. యశోధర్ దగ్గరికి బయల్దేరతారు అందరూ. అప్పుడే మాళిని యశోధర్ చెంప పగలగొడుతుంది. చేయకూడని పనులు చేస్తున్నావంటూ కొడుకుని నిలదీస్తుంది. సులోచనకు హాని చేయాలనుకున్న మాళవికని కాపాడుతున్నావా? నీ కాపురంలో చిచ్చుపెట్టాలని చూస్తుంది ఆ మాళవిక. దాని గురించి మాకంటే నీకే బాగా తెలుసు.. అలాంటి మాళవికని కాపాడాలని చూస్తున్నావా? అంటూ కోప్పడుతుంది. వేదని చూపిస్తూ దీని సంగతేంటి రా. మన ఫ్యామిలీ కోసం తన జీవితాన్నే త్యాగం చేసిందంటూ కోడల్ని పొగడుతుంది. నీ తల్లిగా చెప్తున్న. మన కుటుంబం ఇలా ఉండడానికి కారణం వేదరా.. నీకంటే మాకు వేదే ఎక్కువ. నీకు వ్యతిరేకంగా కేసు పెట్టి సులోచనకు న్యాయం చేస్తాం. నువ్ మావైపా? ఆ రాక్షసి వైపా? నిర్ణయించుకో అంటూ వార్నింగ్ ఇస్తుంది. ఈ వేద నా కూతురని గొప్పగా చెప్పుకుంటానంటుంది మాళిని. నువ్ మా ఇంటి గౌరవం అంటూ వేదని కొనియాడుతుంది. యశోధర్ మాత్రం ఒక్క మాట మాట్లాడకుండా లోపలికి వెళ్లిపోతాడు.
వేదని కలవాలనుకున్న సులోచన మాళిని మాటలు విని నాకు తృప్తిగా ఉంది ఇక వెళ్దాం పదమ్మా అంటూ వెనక్కి వెళ్తుంది. అప్పుడే మాళిని ఏ ముద్దపప్పు అంటూ ఆపుతుంది. నాకు తెలిసిన వదినలో అమ్మని చూసానంటూ.. నాకు ఇప్పుడు చాలా ధైర్యంగా ఉందంటూ గర్వపడుతుంది సులోచన. థాంక్యూ వదిన అంటూ మాళినిని పొగడుతుంది. మాళవికని కాపాడాలని చూడడం ఎంత అమానుషం అన్నగారూ అందుకే గట్టిగా ఇచ్చాను అంటుంది మాళిని. వేద అంటే గిట్టకపోతే చెల్లెగారు ఏం చేశారంటాడు రత్నం. వదిలేయండని సులోచన చెప్పినా వదిలేదే లేదంటుంది మాళిని. లాయర్ గురించి చెప్పి మనమందరం వేదకి సపోర్ట్‌గా ఉండాలంటుంది మాళిని. అపుడు కాంచన మాత్రం వేదకి సపోర్ట్‌గా ఉండనని మనసులో అనుకుంటుంది.
సీన్ కట్ చేస్తే.. యశోధర్ ఒంటరిగా కూర్చుని తల్లి మాటల్ని, వేద మాటల్ని తలుచుకుంటూ బాధపడతాడు. ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో వాళ్లకు చెప్పలేను. చెప్పకుండా ఉండలేను. దీంతో నా కొడుకు భవిష్యత్తు ముడిపడి ఉంది. వేద శిక్ష పడేందుకు గట్టిగా ప్రయత్నిస్తుంది. ఏం చేయాలి నేను అంటూ సతమతమవుతాడు యశోధర్. అపుడే అక్కడికి వస్తుంది వేద. మీకు జరిగిన అవమానానికి మీ భార్యగా నేను బాధపడుతున్నా. కానీ ఓదార్చలేను. రండి భోజనం చేద్దామని పిలుస్తుంది. వేద నాకోసం ఈ కేసును విత్‌డ్రా చేసుకోమని వేడుకుంటాడు. మీకోసం ఏదైనా చేస్తా కానీ ఇది తప్ప అంటాడు యశ్. ఆక్సిడెంట్ జరిగిన తర్వాత రక్తపు మడుగులో ఉన్న మా అమ్మని ఆస్పత్రిలో చేర్చకుండా అక్కడే వదిలేసి ఎందుకు వెళ్లిందంటూ ప్రశ్నిస్తుంది వేద. ఎందుకు దొంగదారిలో శిక్షను తప్పించుకోవాలని చూస్తుంది చెప్పండంటూ నిలదీస్తుంది. నా పిల్లలకు తల్లిగా తనని కాపాడమని వేడుకుంటాడు యశ్. నిజం తెలిసిన వెంటనే చెప్తే నేను మరోలా ఆలోచించేదాన్ని. మనం దగ్గరగా ఉన్న దూరమనిపిస్తుంది దానికి కారణం మీరేనంటూ ఎమోషనల్ అవుతుంది వేద. ఆ తర్వాత ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం..