వేదని మోసం చేసినందుకు యశోధర్ పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. మద్యం సేవించి ఇంటి ముందు అల్లరి చేస్తాడు. భర్తని అలా చూసి వేద మళ్లీ వెళ్లి యశ్‌ని తీసుకొస్తుంది. భర్తను ఉద్దేశించి ఖుషిని మాటలంటుంది. అక్కడ అభి మాళవిక ప్లాన్ ఏంటో తెలుసుకోవాలని అనుకుంటాడు. ఆ తర్వాత నవంబర్ 17 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
ఆక్సిడెంట్ జరిగింది తలచుకుని నిద్రలో భయపడిపోతుంది సులోచన. బెడ్ మీది నుంచి కింద పడుతుంది. దాంతో అందరూ పరుగున వస్తారు. వేద వచ్చి ఏమైందమ్మా.. అని బాధపడుతుంది. మీ అమ్మ నీ గురించే ఈ మధ్య ఎక్కువగా టెన్షన్ పడుతుందమ్మా అని చెప్తాడు వరదరాజులు. నువ్వుండగా నాకేం కాదమ్మా.. అని భరోసానిస్తుంది వేద తల్లికి. మాళిని కూడా మా కోడలు మీద ఈగ వాలకుండా చూసుకుంటామని హామీ ఇస్తుంది. అంతలోనే డాక్టర్ వచ్చి సులోచనను పరీక్షిస్తుంది. వేదని పక్కకు పిలిచి మీ అమ్మ ఆక్సిడెంట్ షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు. తనని ఎక్కువగా టెన్షన్ పడకుండా చూసుకోండి జాగ్రత్త అని చెప్తుంది డాక్టర్. ఆ మాళవికని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నిన్ను నా నుంచి ఆ దేవుడు కూడా కాపాడలేడని శపథం చేస్తుంది వేద.
సీన్ కట్ చేస్తే.. వేద తనని ఏం చేస్తుందోనని మాళవికలో కంగారు పెరుగుతుంది. యశోధర్‌కి ఫోన్ చేయగా కలవదు. అక్కడ వేద ఏం చేస్తుందోనని టెన్షన్ పడుతుంది మాళవిక. అంతలోనే అభి వచ్చి యశోధర్ మీద చాడీలు చెప్తాడు. నేనుండగా నా బంగారం మీద ఈగ కూడా వాలనివ్వనని అంటాడు. నా బలం నా ధైర్యం నా కొడుకు ఆది అని ధైర్యంగా చెప్తుంది మాళవిక. యశోధర్‌కి ఆది అంటే పంచప్రాణాలు. ఆదిని అడ్డుపెట్టుకుని యశోధర్, వేదలని విడగొడతానని అభికి చెప్తుంది మాళవిక.
ఆ తర్వాత సీన్‌లో జరిగిందంతా గుర్తుచేసుకుంటూ కన్నీరు పెడుతుంది వేద. ‘నాకు తెలుసు వేద. మీ అమ్మ పరిస్థితి చూసి నువ్ తట్టుకోలేకపోతున్నావ్’ అంటూ కోడల్ని ఓదారుస్తుంది మాళిని. దీనంతటికి కారణం ఆ ఆక్సిడెంట్ చేసిన వ్యక్తి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్లని వదిలిపెట్టకు వేద అని ధైర్యం చెప్తుంది వేద. కోడలు వెళ్లిన తర్వాత అత్తని ఉద్దేశించి మనసులో అనుకుంటుంది వేద. ఆక్సిడెంట్ చేసింది మాళవిక అని నాకు తెలుసు. తనని కాపాడాలనుకుంటున్నది మీ కొడుకని చెప్పలేను. భర్త మనసు నొప్పించలేను. మాళవికని వదిలిపెట్టలేను. ఆయనకు వ్యతిరేకంగా పోరాడక తప్పదు. నేరం చేసిన మనిషి శిక్ష అనుభవించక తప్పదని సవాల్ చేస్తుంది వేద. ఇదంతా వెనకాలే ఉన్న యశోధర్ వింటాడు.
వేద బిజిబిజీగా పనిచేస్తుండడంతో మాళిని వచ్చి ఏంటని అడుగుతుంది. కేసు గురించి మాట్లాడడానికి లాయర్ ఝాన్సి వస్తుందని చెప్తుంది. అంతలోనే వచ్చిన లాయర్‌కు వాళ్లని పరిచయం చేస్తుంది. లాయర్ కాఫీ తాగుతుండగా యశోధర్ ఆమెని చూసి కంగుతింటాడు. కేసుకు సంబంధించిన విషయాల్ని వేద లాయర్‌కు వివరిస్తుంది. ఆక్సిడెంట్ చేసిన వ్యక్తి జైలుకు వెళ్లాల్సిందేనని అంటుంది వేద. వేదకు మాళిని, రత్నం కూడా సపోర్ట్‌గా ఉంటారు. అవతల కేసుకు సంబంధించి మీ భర్త సపోర్ట్ ఉంది. ఒకరకంగా మీ భార్యభర్తల మధ్య ఈ కేసు గురించి ఫైట్ నడుస్తుందని చెప్తుంది లాయర్. నేను పోరాడుతున్నది యశోధర్‌కి భార్యగా కాదు. సులోచనకి కూతురుగా అంటుంది వేద. దాంతో యశ్ మైండ్ బ్లాక్ అవుతుంది. వెంటనే లాయర్ పరమేశ్వర్‌కు ఫోన్ చేస్తుంది. ఇంట్లో జరిగిందంతా చెప్తాడు యశ్. మీకేం భయం లేదని హామీ ఇస్తాడు లాయర్. కానీ ఝాన్సి పేరు చెప్పగానే పరమేశ్వర్ కూడా షాకవుతాడు. వేద ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదని అంటాడు యశ్. ఆ మాటల్ని వెనక నుంచి వింటుంది మాళిని. మరి కొడుకుని ఎలా మందలిస్తుందో చూడాలి.