ఖుషిని తీసుకుని వేద ఏడుస్తూ ఇంటికెళ్తుంది. కోడల్ని అలా చూసి మాళిని కంగారు పడుతుంది. ఏమైందమ్మా అని ఎంత అడిగినా వేద జరిగింది చెప్పదు. అక్కడ రాత్రయినా కూతురు రాకపోవడంతో సులోచన టెన్షన్ పడుతుంది. తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. ఆ తర్వాత యశోధర్ మద్యం సేవించి ఇంటికి వస్తాడు. మరి ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
పీకలదాకా తాగి వచ్చి సెక్యూరిటీతో అరుస్తాడు యశోధర్. భర్త గొంతు విని వేద వెళ్లి చూసేసరికి న్యూసెన్స్ చేస్తాడు యశోధర్. ఏమండీ లోపలికి వెళ్దాం రండి అంటూ పిలుస్తుంది. నువ్ నన్ను అసహ్యించుకున్నావ్ కదా అంటూ బాధపడతాడు యశోధర్. నా వల్ల అందరూ బాధపడుతున్నారు. నేను నీకు అన్యాయం చేశాను. నన్న వదిలేయ్. నరకం అనుభవిస్తున్నాను నేను. తప్పు చేశానని ఒప్పుకుంటున్నా. నన్ను క్షమించు అంటూ చేతులు జోడించి వేదని వేడుకుంటాడు. లోపలికి రమ్మని వేద ఎంత బతిమాలినా రానంటూ మారాం చేస్తాడు యశ్. చివరకు కోపంగా అరిచి భర్తని తీసుకెళ్తుంది వేద ఇంట్లోకి.
ఆ తర్వాత సీన్‌లో అభికి క్లాస్ పీకుతుంది మాళవిక. ఆక్సిడెంట్ చేసింది నేనేనని ఎందుకు చెప్పావని కోప్పడుతుంది అభిని. దిగజారిపోయి, నన్ను రెచ్చగొట్టింది నువ్వూ అంటూ మాళవికకు రిటర్న్ క్లాస్ పీకుతాడు. నేను ఆ యశోధర్‌ని వదిలిపెట్టనని అంటుంది మాళవిక. ఎంత ఖర్చయినా సరే నేను నిన్ను కాపాడతానని అంటాడు అభి. అయినా మాళవిక వినిపించుకోదు.
భర్తని జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్తుంది వేద. నేను నిన్ను మోసం చేయలేదు వేద. నీకు తెలిసింది నిజం కాదు అంటాడు యశ్. అది నిజం కాకపోతే మరేంటి నిజం అంటూ భర్తని నిలదీస్తుంది వేద. మీ మీద నేను చాలా కోపంగా ఉన్నాను అందుకే మిమ్మల్ని వదిలేసి వచ్చాను. ఇది నా ఫ్యామిలి. కేవలం ఖుషి కోసమే నేను ఇలా నిలబడి మాట్లాడుతున్నానంటూ ఎమోషనల్ అవుతుంది వేద. మీరు ఇక మారరని నాకు అర్థం అయింది. మీ కారణంగా మేం అందరం సఫర్ అవుతున్నాం. నాకు మాత్రం దూరంగా ఉండండి అంటూ కంటతడి పెడుతుంది. లోపలికి తీసుకెళ్తుండగా కిందపడిపోతాడు యశ్. మాళిని వచ్చి కొడుకుని ఛీ కొడుతుంది.
నేను నిన్ను మోసం చేయలేదు వేద అంటూ కలవరిస్తాడు యశ్. భర్తతో గడిపిన రోజుల్ని తలుచుకుంటుంది వేద. చివరకు యశ్‌ని తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెడుతుంది వేద. వెళ్లిపోతున్న వేద చేయి పట్టుకుంటాడు యశ్.
సీన్ కట్ చేస్తే.. కైలాష్ వచ్చి మాళవికతో యశోధర్ రాత్రి తాగి చేసిన గొడవ గురించి చెప్తాడు. ఇక నుంచి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాడు. వేద గురించి మీకంటే నాకే ఎక్కువగా తెలుసని మాళవికని రెచ్చగొడతాడు. మరుసటి రోజు ఉదయం యశ్ నిద్ర లేవగానే వేద ఖుషిలు కనిపిస్తారు. అపుడే ఖుషి పిక్నిక్ గురించి తల్లిని మళ్లీ ప్రశ్నిస్తుంది. అక్కడ హోటల్లో ప్రాబ్లం వల్ల పిక్నిక్ క్యాన్సిల్ అయిందంటుంది వేద. భర్తని ఉద్దేశించి అబద్ధం చెప్పొచ్చా.. మోసం చేయొచ్చా అని ఖుషిని అడుగుతుంది. చిన్న పిల్లవి నీకు తెలిసింది కానీ తెలిసేవాళ్లకి తెలియట్లేదు అంటుంది. నీకు నన్ను కోప్పడే హక్కు ఉంది వేద అనుకుంటూ భార్యని సమర్థించుకుంటూ యశోధర్. వేద నీ కోపానికి తట్టుకోగలనేమో కానీ నీ మంచి తనాన్ని భరించలేకపోతున్నాని భార్యని ఉద్దేశించి అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం..