మీ అమ్మకు ఆక్సిడెంట్ చేసింది మాళవికనే అని అభి వేదకు చెప్తాడు. కానీ వేద భర్త మీద గుడ్డి నమ్మకంతో ఉంటుంది. అభి మాటలను వ్యతిరేకిస్తుంది. ఇప్పుడే వెళ్లి నిజమేంటో తెలుసుకుందాం పద అంటూ హోటల్‌కు వెళ్తారు. అక్కడ యశోధర్ మాళవికను అసహ్యించుకుంటాడు. అమ్మ అంటేనే వేద అంటూ గర్వంగా చెబుతాడు. ఆ తర్వాత నవంబర్ 14 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
హోటల్‌కి వెళ్లిన వేదని చూసి యశోధర్ షాకవుతాడు. సారీ రండి రావాల్సి వచ్చింది. ఈ అభిమన్యు వచ్చి నన్ను కలిసి మీ గురించి ఏం చెప్పాడో తెలుసా.. మీరు నన్ను మోసం చేస్తున్నారట.. నాకు అబద్ధం చెప్పి మాళవికని కాపాడాలని చూస్తున్నారట. అసలు అమ్మకు ఆక్సిడెంట్ చేసింది వేరే ఎవరో కాదు ఈ మాళవిక అని చెప్తున్నాడు అంటుంది వేద అమాయకంగా. మీ గురించి అబద్ధాలు చెప్తున్నారు.. ఈ అభిమన్యు మీ గురించి చెప్తే నేను నమ్ముతానా?.. ఇతనికి చెప్పుతో కొట్టినట్టు నిజం చెప్పండి అంటూ భర్తని నిలదీస్తుంది వేద. నిజంగా మాళవికనే ఈ ఆక్సిడెంట్ చేసి ఉంటే ఇలా పిక్నిక్ వచ్చి ఎంజాయ్ చేసేవాడు కాదని ధీమా వ్యక్తం చేస్తుంది వేద. మిస్టర్ అభిమన్యు మీరు కోరుకున్నట్టు జరగదంటూ వార్నింగ్ ఇస్తుంది. మా అమ్మ ప్రాణాల్ని కాపాడారు మీరు. మీలో కొడుకును చూసుకుంటున్నారు మా అమ్మ నాన్న.. అంటూ భర్తని పొగడుతుంది. మాట్లాడండి యశోధర్ అని వేద ఎంత బలవంతం చేసినా యశ్ నోరు విప్పడు. ఆ తర్వాత ‘వేద నేను దేవుడ్ని కాదు. మామూలు మనిషిని. దయచేసి నా గురించి గొప్పగా మాట్లాడకు. నా మీద నాకే అసహ్యం వేస్తుంది వేద. ఇంకా నేను సఫర్ కాలేను’ అంటూ అరుస్తాడు.
అంటే మీ మాటలకి అర్థం.. ఈ మాళవికనే ఆక్సిడెంట్ చేసిందా.. అని వేద అంటుండగానే జస్ట్ షటప్ అంటూ అరుస్తాడు యశ్. ఇపుడు అర్థమైందా వేద.. నీ భర్త కూడా మాలాగే మోసాలు చేస్తాడని.. అంటూ వేదని నిలదీస్తాడు అభి. మధ్యలో వచ్చిన ఆదిత్యని తీసుకుని వెళ్తుంది మాళవిక కోపంగా. నిన్ను చూస్తుంటే చాలా జాలేస్తుంది వేద అంటూ రెచ్చగొడతాడు అభిమన్యు. చివరకు గదిలో వేద, యశ్‌లే ఉంటారు. భర్త చేసిన అన్యాయానికి కుమిలి కుమిలి ఏడుస్తుంది వేద. దగ్గరికి వచ్చిన భర్త మీదికి రావద్దంటూ అరుస్తుంది. మీకు మనసెలా వచ్చింది అని యశ్‌ని నిలదీయగా.. నేను చెప్పేది వింటావా అంటూ చెప్తాడు. తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందంటాడు యశ్.
మాళవిక కారణంగా మా అమ్మ ప్రాణాలు పోయి ఉండేవి. మీరు ఏం చేసినా నాకు చెప్పి చేయమని చెప్పానా లేదా.. మన మధ్య ఉన్న బంధం నిజాయితి. మనం ఒకరికొకరం భరోసా. ఈ రోజు మీరు నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు అని వేద ఎమోషనల్ అవుతుండగానే అమ్మా.. అంటూ వస్తుంది ఖుషి. నువ్ ఎపుడు వచ్చావ్? మీరెందుకు గొడవపడుతున్నారని అడుగుతుంది. ఖుషి అంటూ వాటేసుకుని ఏడుస్తుంది వేద. అంతా అయిపోయిందమ్మా.. ఇంకా ఇక్కడ మనం ఒక్క క్షణం కూడా ఉండకూడదంటూ ఖుషిని తీసుకుని వెళ్లిపోతుంది. నీకెలా చెప్పాలి వేద. నాతో నేనే పోరాడి అలిసిపోయాను. ఇంతకంటే పెద్ద శిక్ష ఏం ఉంటుంది. నేను మోసం చేయలేను వేద. నన్ను నేనే మోసం చేసుకుంటున్నాను. వాళ్లమ్మని కాపాడతానని నా ఆదికి మాటిచ్చాను. వాడు నా ప్రాణం. హర్ట్ అయితే తట్టుకోలేను. ఇది నాకు నేను విధించుకున్న శిక్ష ఇది. భగవంతుడా నాకే ఎందుకిలా? అనుకుంటూ పశ్చాత్తాప పడతాడు యశ్. అలా వేద, యశ్‌లు ఇద్దరూ బాధపడతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం..