బుంగమూతి పెట్టిన చెల్లిన బుజ్జగిస్తుంది వేద. అక్కడ యశోధర్ మాళవికని అసహ్యించుకుంటాడు. అమ్మ అంటేనే వేద అంటూ భార్యని ఆకాశానికెత్తుతాడు. ఆ తర్వాత క్లినిక్ బయల్దేరుతుంది వేద. ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
వేద కారుకు అడ్డంగా కారు పెడతాడు అభిమన్యు. నీకు చేతనైతే నీ జీవితంలోకి చొరబడిన మాళవికని గెట్ అవుట్ అనమని రెచ్చగొడతాడు అభి. మాళవిక చేస్తున్న చెడు పనుల గురించి వేదకు చెప్తాడు. అయినా వేద నమ్మకపోవడంతో సాక్ష్యాలతో వచ్చానంటూ మాళవిక డీపీని చూపిస్తాడు అభి. అందులో ఏముంది నేనే వాళ్లని పిక్నిక్ పంపించానంటుంది వేద. నేను ఇప్పుడు చెప్పబోయే నిజం అబద్ధం నిరూపించు వేద. మీ అమ్మ సులోచకు ఆక్సిడెంట్ చేసింది ఎవరో కాదు మాళవిక. ఆ రహస్యాన్ని నీ దగ్గర దాచిపెట్టి మాళవికని కాపాడుతుంది నీ భర్త. సాక్ష్యాలు తారుమారు చేసి మరి మాజీ భార్యని కాపాడాలనుకుంటున్నాడు అని చెప్పేస్తాడు. పిల్లల సాకులు చెప్పి పిక్నిక్‌లు ఎంజాయ్ చేస్తున్నారు అంటూ వేదని రెచ్చగొడతాడు అభి.
సీన్ కట్ చేస్తే.. ఆది స్విమ్మింగ్ చేస్తుంటే యశ్ వెళ్లి పిలుస్తాడు. కింద పడబోయిన ఆదిని పట్టుకుని కంగారు పడతాడు యశ్. అక్కడ మాళవిక కుట్రలన్నీ వేదకు చెప్పినా నమ్మదు. నువ్ చెప్పినవన్నీ ఇప్పుడు కాదు ఒకప్పుడు అంటూ భర్తని వెనకేసుకొస్తుంది. తన భర్త ఏ తప్పు చేయడు అంటూ పొగడుతుంది. నా భర్త నిలువెల్లా నిజం.. నిజాయితీ అంటూ కొనియాడుతుంది. నా భర్త నాకు అన్యాయం చేస్తాడంటే నేను నమ్మను. ఇప్పుడే నీ సంగతి తేల్చిస్తే.. పద అంటూ యశోధర్ దగ్గరికి అభిని తీసుకెళ్తుంది వేద.
మాళవికతో ఖుషిని పిక్నిక్ పంపించినందుకు కోపంతో రగిలిపోతుంది సులోచన. నా మనవరాలిని ఆ మాళవికతో పిక్నిక్ పంపిస్తారా మీరు అంటూ మాళినిని కోప్పడుతుంది. ఖుషిని పిక్నిక్ పంపించింది నేను కాదు మీ ముద్దుల కూతురు అంటూ జరిగిందంతా చెప్తుంది మాళిని. లోకంలో వేద ఒక్కతే వేరే వాళ్ల సంతోషం గురించి ఆలోచిస్తుందంటూ కోడల్ని పొగడుతుంది మాళిని. ఏ ముద్దపప్పు నువ్ అదృష్టవంతురాలివి అంటూ వేదని ఆకాశానికెత్తుకుంటుంది.
కాసేపట్లో జరగబోయేది తలుచుకుంటేనే ఆనందంగా ఉందంటాడు అభి వేదతో. స్విమ్మింగ్‌కి నువ్ ఎందుకు రాలేదు మామ్ అంటాడు ఆది. నీకు బిర్యాని తెచ్చిపెట్టానని మాళవిక చెప్తే నేను నాన్నతో కలిసి రెస్టారెంట్‌కి వెళ్తానంటాడు ఆది. సరేనంటాడు యశోధర్. లగేజి ప్యాక్ చేయ్ మాళవిక.. తినేసి రాగానే వెళ్దాం అంటాడు యశ్. ఇంటికెళ్లాక నీ దారి నీది నా దారి నాది అంటాడు. ఇంటిదగ్గర వేద నాకోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. నేను కూడా వేదని చూడాలని ఆతృతగా ఎదురు చూస్తున్నానంటాడు యశ్. మాళవిక ముందు భార్యని పొగడుతాడు యశ్. వేద లేకపోతే నా జీవితమే లేదంటూ మాజీ భార్యకి కౌంటర్ వేస్తాడు.
వేద అభితో కలిసి హోటల్‌కి వెళ్తుంది. అభిని చూసి నువ్ ఇక్కడికెందుకు వచ్చావ్ అంటుంది మాళవిక. నేను ఒక ఇంపార్టెంట్ పర్సన్ తీసుకువస్తే వచ్చాను అంటాడు యశ్. ఎవరది అని అడగ్గా.. మిసెన్ వేదశ్విని అని చూపిస్తాడు. మరి వేద నిజం నిరూపిస్తుందా లేదా తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..