లాయర్ పరమేశ్వర్ యశోధర్‌తో మాటల్ని వింటుంది చిత్ర. వెంటనే జరిగిందంతా వేదకు చెప్తుంది కానీ తన భర్తనే నమ్ముతుంది వేద. ఆ తర్వాత యశ్ పిల్లలతో కలిసి పిక్నిక్ ఎంజాయ్ చేస్తాడు. మాళవికని ఖుషి అసహ్యించుకుంటుంది. ఫ్యామిలీతో దిగిన ఫొటోని డీపీగా పెట్టుకుంటుంది మాళవిక. ఆ తర్వాత నవంబర్ 10 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
స్విమ్మింగ్‌కి వెళ్దాం నాన్నా అని ఆదిత్య అడగ్గా.. నేను కూడా వస్తానంటుంది మాళవిక. వేదకు శాశ్వతంగా తనని దూరం చేస్తానన్న మాటల్ని గుర్తు చేసుకున్న ఖుషి మాళవిక యశ్‌తో స్విమ్మింగ్ చేయకూడదని అనుకుంటుంది. కడుపు నొప్పి అంటూ నాటకమాడుతుంది. దాంతో ఆది ఒంటరిగా స్విమ్మింగ్‌కి వెళ్తాడు. మాళవిక రిసెప్షన్‌కి ఫోన్ చేసి ట్యాబ్లెట్లు పంపించమంటుంది. అక్కడ వేద మాటలకు చిత్ర మాటలకు చిత్ర బుంగమూతి పెడుతుంది. దాంతో వేద వెళ్లి చెల్లిని బుజ్జగిస్తుంది. పెళ్లయ్యాక లైఫ్ వేరేలా ఉంటుంది అంటూ స్పీచ్ ఇస్తుంది వేద. దాంతో చిత్ర అలక మానుతుంది. సులోచన ఇంటికి వెళ్లిన వేద కోసం ఎదురు చూస్తుంటుంది మాళిని. రత్నం వచ్చి కూరగాయలు తీసుకురమ్మంటాడు. సులోచనతో పోట్లాడితే బాగుంటుందంటుంది మాళిని.
సడెన్‌గా ఇంత కడుపు నొప్పి ఏంటి అంటూ టెన్షన్ పడతాడు యశ్. మాళవిక మాత్రం స్విమ్మింగ్ వెళ్దాం అంటుంది. దాంతో యశ్ మాళవిక మీద అరుస్తాడు. దీని కడుపు నొప్పి కోసం స్విమ్మింగ్ మానుకోవాలా? అంటూ నిలదీస్తుంది భర్తని. నీ స్థానంలో వేద ఉంటే విలవిలలాడిపోయేది. కన్నీళ్లు పెట్టుకునేది అదీ అమ్మంటే.. అంటూ భార్యని పొగడతాడు యశ్. ఖుషికి అమ్మ ఆ వేద అయితే నేనెవరిని అంటూ గొడవపడుతుంది మాళవిక. ఆ వేదకు కడుపు లేదు కాకరకాయ లేదు.. గొడ్రాలు అంటూ వేదని నిందిస్తుంది. దాంతో యశ్ మాజీ భార్య మీద ఫైర్ అవుతాడు. అసలు ఎపుడైనా ఖుషికి అమ్మలా ఉన్నావా నువ్.. ఖుషికి అమ్మ ప్రేమ పంచింది వేద. అమ్మ అంటేనే వేద అని భార్యని పొగడతాడు యశ్. నీకు వేదతో పోలీకేంటి.. నా దృష్టిలో నువ్ అసలైన గొడ్రాలివి అంటూ చులకన చేస్తాడు. ఖుషి కడుపు నొప్పి అంటూ ఏడవడంతో డాక్టర్ దగ్గరికి వెళ్తాడు యశ్.
ఆ తర్వాత సీన్‌లో.. కైలాష్ మాళవిక డీపీ పట్టుకుని వచ్చి అభిమన్యుని రెచ్చగొడతాడు. మీరు లేకుండా ఫ్యామిలీ పిక్నిక్ ఏంటి అంటూ అభికి మాళవిక మీద కోపం పెంచుతాడు. ఈ ఫొటో ఇప్పటికే ప్రపంచమంతా చూసే ఉంటుంది. అందరూ అడిగితే ఏం చెప్తారు? అభిని రెచ్చగొడతాడు. దాంతో అభి కోపంగా వెళ్లిపోతాడు అక్కడినుంచి.
ఆదితో కలిసి బయటికి వెళ్లినందుకు ఖుషి హ్యాపీగా ఉండి ఉంటుందని మనసులో అనుకుంటుంది వేద. పిల్లల్ని కలిపి ఉంచడానికి యశ్ ఎంతో ఆరాటపడుతున్నాడంటూ ఆలోచిస్తుంది. ఆ తర్వాత అభి మాళవికకు ఫోన్ చేస్తాడు. నీ పద్ధతి నాకు నచ్చట్లేదు అంటూ వార్నింగ్ ఇస్తాడు. నాకు నచ్చినట్లు ఉంటానని కౌంటర్ ఇస్తుంది మాళవిక. నామీద అరుస్తావేంటి నువ్వేమైనా నా మొగుడివా? అని బెదిరిస్తుంది. అలా ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. దాంతో మాళవిక అంతు చూసేందుకు బయల్దేరుతాడు అభి. వేద దగ్గరికి వెళ్లి తన తల్లికి ఆక్సిడెంట్ చేసిందెవరో చెప్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో వేచి చూడాలి..