God Father: మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా “గాడ్ ఫాదర్” అక్టోబర్ 5వ తారీఖు విడుదల కానున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషించడం జరిగింది. మలయాళం “లూసిఫర్” సినిమాకి రీమేక్ గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. “ఆచార్య” అట్టర్ ప్లాప్ కావడంతో “గాడ్ ఫాదర్” విషయంలో చిరంజీవి ఆచితూచి అడుగులు వేయడం జరిగింది. ఇదిలా ఉంటే “ఆచార్య” సినిమా అట్టర్ ప్లాప్ కావటానికి “ఆ” సెంటిమెంట్ అని అప్పట్లో అభిమానులు భావించారు.
చిరంజీవి నటించిన ఆరాధన, ఆపద్బాంధవుడు దానికి ఉదాహరణగా చెప్పుకు రావడం జరిగింది. ఇప్పుడు ఇదే తరహా సెంటిమెంట్ “గాడ్ ఫాదర్” కి ఉన్నట్లు భావిస్తున్నారు. పూర్తి విషయంలోకి వెళ్తే ఇంగ్లీష్ టైటిల్ సెంటిమెంట్ ముప్పు మెగా ఫ్యామిలీకి ఉందని టాక్. గతంలో రామ్ చరణ్ నటించిన ఇంగ్లీష్ టైటిల్స్ మూవీ ఆరెంజ్, బ్రూస్ లీ రెండు కూడా పరాజయం అయ్యాయి. ఇక చిరంజీవి కెరియర్ లో ఇంగ్లీష్ టైటిల్స్ తో దాదాపు పది చిత్రాలకు పైగానే సినిమాలు చేస్తే వాటిలో చాలా వరకు సగానికి పైగానే అట్టర్ ప్లాప్ అయ్యాయి.
దీంతో ఇప్పుడు ఇంగ్లీష్ టైటిల్ మప్పు “గాడ్ ఫాదర్” కి ఉంటుందేమో అనే ఆందోళనలో మెగా అభిమానులు ఉన్నారు. మరోపక్క ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరగటం విశేషం. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో… నయనతార, సునీల్, పూరి జగన్నాథ్ మరి కొంతమంది కీలక నటీనటులు నటించారు. సినిమాలో పొలిటికల్ లీడర్ గా చిరంజీవి నటిస్తున్నట్లు.. సినిమాకి సంబంధించి విడుదలైన వీడియో బట్టి తెలుస్తోంది.