ENG v/s AFG: పొట్టి క్రికెట్లో అద్భుతంగా రాణించే ఆటగాళ్లు ఇంగ్లాండ్ జట్టు సొంతం. టాప్ క్లాస్ బ్యాటింగ్ తో, టాప్ క్లాస్ బౌలింగ్ తో అదరగొడతారు. తాజాగా సూపర్ -12 పోరులో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో అఫ్గానిస్థాన్ జట్టును 112 పరుగులకే ఇంగ్లాండ్ జట్టు బౌలర్లు కుప్పకూల్చారు.
ఇంగ్లాండ్ బౌలర్ సామ్ కుర్రన్ 3.4 ఓవర్లలో 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 కీలక వికెట్లు పడగొట్టాడు.
113 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు సునాయాసంగా విజయం సాధించింది. 18.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి నిర్దేశిత లక్ష్యాన్ని చేదించింది. ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ ఆటగాళ్లు పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయకపోయినా చేదింత చేదించాల్సిన లక్ష్యం చిన్నది కావడంతో ఇంగ్లాండ్ గెలుపు సులువుగా మారింది. ఇంగ్లాండ్ ఆటగాళ్లలో లివింగ్ స్టన్ 21 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 29 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ గెలుపుతో ఇంగ్లాండ్ జట్టుకు రెండు పాయింట్లు లభించాయి.
టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకొని ఆఫ్ఘనిస్తాన్ జట్టును బ్యాటింగ్ ఆహ్వానించింది. మొదట బ్యాటింగ్ కు చేసిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఆఫ్గనిస్తాన్ ఆటగాళ్లలో పెద్దగా ఎవరూ రాణించలేదు. ఇబ్రహీం జాద్రాన్ 32, ఉస్మాన్ ఘనీ 30 పరుగులు చేశారు.
ఆఫ్ఘనిస్తాన్ పతనాన్ని శాసించిన సామ్ కుర్రన్ 5 వికెట్లు పడగొట్టాడు. ఇతర ఇంగ్లాండ్ బౌలర్లు మార్క్ వుడ్ 2, స్టోక్స్ 2, క్రిస్ వోక్స్ 1 వికెట్ తీసుకున్నారు.
ENG v/s AFG:
ముందు నుంచే ఆఫ్గనిస్తాన్ బౌలర్లకు బౌలింగ్ లో మంచి రికార్డు ఉంది. కొద్దిగా ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన చేసి ఉంటే బౌలర్లు ఇంగ్లాండ్ బ్యాటర్ల జోరును అడ్డుకునేవాళ్లు. కానీ బ్యాటర్లు విఫలమవడంతో మ్యాచ్ చేజారిపోయింది. ఈ మ్యాచ్ లో 5 వికెట్లు పడగొట్టిన సామ్ కుర్రన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కు ఎంపికయ్యాడు. ఇంగ్లాండ్ తన తర్వాతి మ్యాచ్ ను ఐర్లాండ్ తో ఆడనుంది.