Bigg boss 6: టైటిల్ చూడగానే.. మీకొక సామెత గుర్తొంచి ఉంటుంది కదా.. ఆలూ లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అని.. నామినేషన్స్ ఎపిసోడ్ ఇంకా ప్రారంభం కాలేదు.. ఎలిమినేషన్‌పై క్లారిటీ వచ్చిందా? అనే డౌట్ రాకపోదు. నామినేషన్స్ అంటేనే ఒక అదిరిపోయే ఎపిసోడ్. ఒకరినొకరు బీభత్సంగా తిట్టుకున్నారా? మన మనసు శాంతిస్తుంది. లేదంటేనా? ఇవొక నామినేషన్సా? ఇదొక బిగ్‌బాసా? అంటూ అడ్డమైన తిట్లన్నీ గుర్తొస్తాయి. ఈసారి నామినేషన్స్ మాత్రం ప్రోమోను బట్టి మన మనసు శాంతించేలాగే ఉన్నట్టు తెలుస్తోంది.
నామినేషన్స్‌లో ఆసక్తికర విషయం ఏంటంటే.. గలాటా గీతూకి వాళ్ల అన్నయ్యకు పడింది. బాలాదిత్య ఇవాళ గీతూని నామినేట్ చేసేశాడు. సుదీప వర్సెస్ రేవంత్.. కీర్తి వర్సెస్ శ్రీ సత్య ఒకరేంటి అబ్బబ్బా.. మంచి కంటెంటే ఇచ్చేలా ఉన్నారు. ఇక ఈ వారం రేవంత్ కెప్టెన్‌గా ఉన్నాడు కాబట్టి ఈ వారం నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యాడు. ఇక ఈ వారం తొమ్మిది మంది నామినేషన్స్‌లో ఉన్నారు. వారిలో ఈ వారం ఎలిమినేట్ కాబోయే ఎవరు? అనే దానిపై క్లారిటీ వచ్చేసింది. ఇది ఇప్పటి వరకూ జరిగిన నామినేషన్స్‌లో ఓటింగ్‌ను బట్టి చూస్తే మాత్రం ఈ వారం ఎలిమినేషన్‌పై ఒక అంచనాకు రావొచ్చు.
ఈవారం నామినేషన్స్‌లో ఇనయ సుల్తానా, శ్రీహాన్, కీర్తి భట్, ఆదిరెడ్డి, గీతూ, రాజ్, అర్జున్, బాలాదిత్య, సుదీప ఉన్నారు. రేవంత్ నామినేషన్స్‌లో లేడు కాబట్టి పక్కాగా ఈ వారం ఇనయ టాప్‌లో ఉంటుంది. ఆ తరువాత శ్రీహాన్ ఉంటాడు. గత వారం మాదిరిగానే ఈ వారం కూడా శ్రీహాన్ గేమ్ ఉంటే మాత్రం టాప్‌లోకి కూడా వెళ్లే అవకాశాలున్నాయి. ఇక ఆ తరువాత కీర్తి ఉండే అవకాశం ఉంది. ఆ తరువాతి స్థానాల్లో ఆదిరెడ్డి, గీతూ ఉండనున్నారు. వీరి వరకూ ఎలాంటి సందేహం లేకుండా సేఫ్ జోన్‌లో ఉంటారు. ఇక రాజ్ ఈ మధ్యే కాస్త మాట్లాడుతున్నాడు కాబట్టి రాజ్‌కి ఇబ్బందేం లేదు. అర్జున్‌కి శ్రీసత్య ఓటింగ్ కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి ఫైనల్‌గా మిగిలింది ఇద్దరే.. బాలాదిత్య, సుదీప. వీరిద్దరిలో బాలాదిత్యనైతే ఆడియన్స్ వదులుకోరు. కాబట్టి ఈవారం బీభత్సంగా ఆడితే తప్ప సుదీప హౌస్‌లో ఉండే అవకాశమే లేదు.