munugodu : మునుగోడు సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఆ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. దీంతో మునుగోడు ఉపఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ గెలిచేందుకు పార్టీలన్నీ ఇప్పటినుంచే పాపులు కదుపుతున్నాయి. అక్కడ గెలిచేందుకు ఇప్పటిుంచే వ్యూహలు రచిస్తున్నాయి.
అయితే మునుగోడు ఉపఎన్నికకు ఈసీ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన ఆరు నెలల లోపు ఈసీ ఎన్నికలు జరిపి భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి రెండు నెలలు కావొస్తుంది. దీంతో గుజరాత్ , హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ ఏడాది డిసెంబర్ లో ఎన్నికలు జరపాల్సి ఉంది. దీంతో ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటే దేశంలో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈసీ కావాలనుకుంటే ఎప్పుడైనా నోటిఫికేషన్ ఇవ్వవచ్చు.
munugodu :
కానీ వచ్చే నెలలోనే మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్ వచ్చే అవకాశముందని తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా చెప్పినట్లు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అమిత్ షా.. తెలంగాణ నేతలతో కోర్ కమటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అక్టోబర్ నెలలోనే మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్ వచ్చే అవకాశముందని, ప్రచారం ముమ్మరం చేయాలని సూచించారట. ఈసీ అనేది స్వతంత్ర సంస్థ. కానీ అధికార పార్టీలకు ఈసీపై పట్ట ఉంటుంది. ఎన్డీయే ప్రభుత్వంలో రాజ్యాంగ సంస్థలను తమ స్వప్రయోజనాల కోసం బీజేపీ వాడుకుంటుందనే ఈరోపణలు ఉన్నాయి. అందుకే అధికార పార్టీ చెప్పినట్లు ఈసీ నడుచుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈసీని కేంద్రం తన కనుసన్నల్లోనే పెట్టుకుని ప్రభావితం చసే అవకాశముంది. దీంతో మునుగోడు ఉపఎన్నిక ఎప్పుడు వస్తుందనేది హోంశాఖ మంత్రి అమిత్ షాకు తెలియకుండా ఉంటుందా అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.