Egg Yolk: సండే అయినా మండే అయినా రోజూ తినండి గుడ్డు అనే యాడ్ చాలామందికి గుర్తుండే ఉంటుంది. గుడ్డులో ఎన్నో పోషకాలు ఉంటాయి కాబట్టి వాటిని ప్రతిరోజు తినాలని డాక్టర్లు సలహా ఇస్తుంటారు. గుడ్డులో రకరకాల విటమిన్లు, ప్రోటీన్లతో పాటు ఇతర అనేక మూలకాలు ఉంటాయి. గుడ్డు తినడం వల్ల శరీర కణాల పెరుగుదల మెరుగవుతుంది, నాడీవ్యవస్థ బలపడుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతంది.
గుడ్డు తినమని డాక్టర్లు సలహా ఇస్తే, గుడ్డులోని సోన తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందనే ఉద్దేశంతో చాలామంది పచ్చసోనను పక్కకు పెట్టేస్తుంటారు. అయితే పచ్చసోనకు సంబంధించి ఇది అపోహ మాత్రమే అని వైద్యులు అంటున్నారు. పచ్చసోనలో మంచి కొవ్వు ఉంటుందని, ఇది శరీరరానికి మేలు చేస్తుందని చెబుతుంటారు.
కొలెస్ట్రాల్ ఒక్క కారణంతో అనేక ప్రయోజనాలు ఇచ్చే పచ్చసోనని తినకుండా ఉండవద్దని వైద్యలు చెబుతారు. గుడ్డులోని తెల్లసోనలో కంటే పచ్చసోనలోనే ఎక్కువ విటమిన్లు ఉంటాయి. పచ్చసోనలో విటమిన్లు A, K, E, D ఉంటాయి. ఇవి మిగిలిన గుడ్డులో ఉండవు. అలాగే పచ్చసొనలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి గుడ్లు తినేటప్పుడు పచ్చసొనను వదిలేయడం అంటే చాలా వరకు ప్రొటీన్‌లను వదిలివేయడమే అవుతుందని వైద్యులు చెబుతారు.
Egg Yolk:
గడ్డులోని పచ్చసోనలో 90 శాతం కాల్షియం, 93 శాతం ఐరన్ ఉంటాయి. తెల్లసొనలో లేని ఎన్నో పోషకాలు పచ్చసోనలో ఉంటాయి. తెల్లసోనలో కేవలం 7శాతం పోషకాలు ఉంటే, మిగిలిన అన్ని పోషకాలు పచ్చసోనలో ఉంటాయి. కంటికి వచ్చే అనేక ముప్పులను గుడ్డులోని పచ్చసోన వల్ల ఎదుర్కోవచ్చని శాస్త్రీయంగా నిరూపితమైంది. కాబట్టి ఈసారి గుడ్డు తినేటప్పుడు పచ్చసోనను కూడా తినడం మర్చిపోకండి.