Egg For Weight Loss: చిన్నప్పటి నుంచి గుడ్డు తింటే పోషకాలు వస్తాయి అని డాక్టర్లు చెప్పడం వింటూనే ఉంటాం. అయితే గుడ్డులోని పోషకాలు బరువు తగ్గడంలోనూ సహాయపడతాయని మీకు తెలుసా ? ఒక వేళ మీరు అధిక బరువు వల్ల ఇబ్బంది పడుతున్నా.. బరువు తగ్గాలని ఆలోచిస్తున్నా.. గుడ్డు మంచి ఎంపిక అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గుడ్లు మంచి ప్రోటీన్ ఆహారంగా పరిగణిస్తారు. దీనితో పాటు, క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు గుడ్లలో తక్కువ మొత్తంలో లభిస్తాయి. అందుకే ఆహారంలో గుడ్లను చేర్చుకోవడం వల్ల బరువు తగ్గడం సులువు అవుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇది కండరాల నిర్మాణంలో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే బరువు తగ్గేందుకు, ఆరోగ్యంగా ఉండేందుకు గుడ్లు ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.
గుడ్లలో ఖనిజాలు, విటమిన్లు, సెలీనియం, కోలిన్ పుష్కలంగా ఉంటాయి. ఇది రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. గుడ్లను ఆహారం తీసుకున్న వారిలో బరువును సమర్థవంతంగా తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. బరువు తగ్గాలనుకునే వారు తమ ఆహారంలో ఉడికించిన గుడ్లు లేదా మామూలుగా వండిన గుడ్లను చేర్చుకోవచ్చు. ఇది అదనపు కొవ్వును తగ్గిస్తుంది. గుడ్డులోని తెల్లసొన బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జిమ్‌కు వెళ్లే వారికి గుడ్లు శక్తినిస్తాయి.
మిరియాలతో పాటు తింటే…
నల్ల మిరియాలు ప్రతి ఇంట్లో ఉంటాయి. ఈ నల్ల మిరియాల పొడిని గుడ్లతో పాటు తీసుకోవడం వల్ల బరువు వేగంగా తగ్గుతారు. ఎందుకంటే నల్ల మిరియాలు వాడకం జీవక్రియ రేటును మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ సమస్యను తొలగిస్తుంది. దీనితో పాటు శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోవడానికి ఇది అనుమతించదు. మీరు గుడ్డును ఆమ్లెట్ గా వేసుకుని లేదా ఉడికించిన గుడ్లపై నల్ల మిరియాల పొడిని చల్లుకుని తినవచ్చు. ఇది కొవ్వును కరిగించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
Egg For Weight Loss: గుడ్డులోని పోషక విలువలు:
గుడ్లు పోషకాలతో నిండిన ఆహారంగా చెప్పుకోవచ్చు. ఇందులో ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాదు మన శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలను గుడ్డు కలిగి ఉంటుంది. గుడ్డులో ప్రోటీన్స్ 5.5 గ్రా ఉంటే, కొవ్వు: 4.2 గ్రా, కాల్షియం: 24.6 మి.గ్రా, ఐరన్: 0.8 మి.గ్రా, మెగ్నీషియం: 5.3 మి.గ్రా, భాస్వరం: 86.7 మి.గ్రా, పొటాషియం: 60.3 మి.గ్రా, జింక్: 0.6 మి.గ్రా, కొలెస్ట్రాల్: 162 మి.గ్రా, సెలీనియం: 13.4 మైక్రోగ్రాములు (mcg)ఉంటాయి.