congress leaders: టీ కాంగ్రెస్ లో మరోసారి కలకలం రేగింది. పలువురు టీ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులుారీ చేయడం ఆ పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో టీ బీజేపీ నేతలైన మాజీ కేంద్రమంత్రి, ఖమ్మం మాజీ ఎంపీ రేణుకా చౌదరికి ఈడీ నోటీసులు వచ్చాయి. అలాగే షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డికి ఈడీ నోటీసులు అందాయి. అక్టోబర్ 10న ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నేషనల్ హెరాల్డ్ కేసును తెరపైకి తీసుకొచ్చింది. నేషనల్ హెరాల్డ్ పత్రికను కొనుగోలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ తన నిధులను దుర్వినియోగం చేసిందనే ఆరోపణలో సీబీఐ, ఈడీ కేసులు నమోదయ్యాయి.
దీంతో ఇప్పటికే ఈ కేసులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను సీబీఐ, ఈడీ ప్రశ్నించింది. దాదాపు వారంరోజుల పాటు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను సీబీఐ, ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఆ తర్వాత ఈ కేసులో కాస్త దూకుడు తగ్గిన క్రమంలో ఇప్పుడు తెలంగాణలోని కాంగ్రె్ నేతలకు ఈడీ నోటీసులు పంపండం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు ఢిల్లీకి పరిమితమైన ఈ కేసు ఇప్పుడు తెలంగాణకు పాకింది.
ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కుంభకోణం తెలంగాణ రాజకీయాలను కుదిపేసింది. ఈ తరుణంలో నేషనల్ హెరాల్డ్ కేసులో టీ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోుటీసులు రావడం కలకలం రేపుతోంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ కు కూా చిక్కులు వచ్చినట్లు అయింది. కానీ తనకు ఎలాంటి ఈడీ నోటీసలుు అందలేదని, ఈడీ నోటీసులు వస్తే విచారణకు హాజరవుతానని షబ్బీర్ అలీ తెలిపారు. నేషనల్ హెరాల్డ్ కు డొనేషన్ ఇచ్చిన మాట వాస్తవమేనని షబ్బీర్ అలీ తెలిపారు. దీంతో రానున్న రోజుల్లో నేషనల్ హెరాల్డ్ కేసు తెలంగాణలో ఎలాంటి దుమారం రేపుతుందనేది చర్చనీయాంశగా మారింది.
congress leaders:
2012లో బీజేపీ ఎంపీ సుబ్రహ్మాణ్యస్వామి నేషనల్ హెరాల్డ్ లో అక్రమాలు జరిగాయంటూ సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై కేసుప ెుట్టారు. డిల్లీ హైకోర్టులో ఫిర్యాదు చేవారు.