బెంగుళూరు డ్రగ్స్ మాఫియా వ్యవహారం దేశ వ్యాప్తంగా ఎంత సంచలనంగా మారిందో అందరికి తెలిసిందే. ఈ కేసులో పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు సినీ తారల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఆ డ్రగ్స్ వ్యవహారంలోనే బెంగుళూరులో కన్నడ హీరోయిన్స్ సంజనా గల్రాని, రాగిణి ద్వివేది అరెస్ట్ చేశారు. కొద్ది రోజులు వారు జైల్లో కూడా ఉన్నారు. ప్రస్తుతం బెయిల్ పై ఉన్న బయట ఉన్నారు. సంజనా గల్రాని పెళ్లి చేసుకోగా, రాగిణి ద్వివేది మాత్రం సినిమాలలో బిజీ అవుతుంది. ఈ డ్రగ్స్ వ్యవాహారం అంతా ఈడీ విచారణలోనే కొనసాగింది. అయితే చాలా రోజుల తర్వాత ఈ వ్యవహారంలో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగి ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేసే ప్రయత్నం చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ కి ఈడీ నోటీసులు ఇచ్చింది.
అలాగే తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. పెద్ద పెద్ద వాళ్ళతో సంబంధాలు ఉండే ఈ డ్రగ్స్ కేసుని ఎవరు ఇన్వెస్టిగేషన్ చేసిన వాటిలో పురోగతి ఉండదు. గతంలో హైదరాబాద్ లో డ్రగ్స్ వ్యవహారంలో టాలీవుడ్ కి చెందిన చాలా మంది ప్రముఖులని విచారించారు. అయితే తరువాత ఈ కేసు విచారణలో ఏం జరిగింది, ఎలాంటి నిజాలు తెలుసుకున్నారు అనేది ఇప్పటి వరకు బయటకి రాలేదు. అయితే కొంత కాలం క్రితం ఎమ్మెల్యేల కొనుగోళ్ళు వ్యవహారంలో బీజేపీ నాయకులని అడ్డంగా ఇరికించడంలో పైలెట్ రోహిత్ రెడ్డి కూడా కీలకంగా వ్యవహరించారు.
ఈ నేపధ్యంలో టీఆర్ఎస్ ని కార్నర్ చేసే ఉద్దేశ్యంతోనే మళ్ళీ కేంద్ర ప్రభుత్వంలో బెంగుళూరులో మూలాన పడిపోయిన డ్రగ్స్ వ్యవహారాన్ని బయటకి తీసుకొచ్చి అందులో రోహిత్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ కి నోటీసులు ఇవ్వడం వెనుక కూడా రాజకీయ కారణాలు ఉన్నాయనే మాట వినిపిస్తుంది. టీఆర్ఎస్ లో అందరికి తెలిసే కీలక నేతతో రకుల్ ప్రీత్ సింగ్ కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ప్రచారం తెలంగాణ రాజకీయ వర్గాలలో నడిచింది. ఈ నేపధ్యంలో ఆ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం బీజేపీ చేయడానికి ఆమెకి నోటీసులు ఇచ్చి ఉంటారని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట.