ఒకప్పుడు భూమి చదరపు ఆకారంలో ఉండేదని శాస్త్రవేత్తలు భావించేవారు. ఆకారణంగా మనం భూమిపై నివసించ గలుగుతున్నాం అని అనుకునేవారు. అయితే పైథాగరస్ అనే శాస్త్రవేత్త భూమి గుండ్రంగా ఉందనే విషయాన్ని శాస్త్రీయంగా నిర్ధారించి చెప్పారు. అంతకు ముందే భారతీయ గ్రంధాలలో గ్రాహాల ఉనికి గురించి ఆర్యబట్ట ప్రపంచానికి పరిచయం చేస్తూ భూమి గుండ్రంగా ఉంటుందని చెప్పారు. అయితే దీనిని ప్రాక్టికల్ గా తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇంతకాలం సైన్స్ పుస్తకాలలో భూమి గుండ్రంగా ఉందనే విషయాన్ని అందరూ నమ్ముతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు భూమి గుండ్రంగా లేదని సరికొత్త థియరీ తెరపైకి వచ్చింది. భూమి దీర్ఘవృత్తాకారంలో ఉందని శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు.
భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి తన రూపాన్ని నిర్దేశించడంలో కీలకంగా మారుతుందని శాస్త్రవేత్తలు తమ నేచుర్ కమ్యూనికేషన్స్ అనే సైన్స్ జర్నల్ లో పేర్కొన్నారు. భూమి కేంద్రం నుంచి ద్రువాల మధ్య దూరంతో పోల్చి చూస్తే భూమధ్య రేఖ నుంచి ఉపరితలం వరకు ఉన్న దూరం చాలా ఎక్కువగా ఉందని. ఒకవేళ గుండ్రంగా ఉంటే అన్ని చోట్ల సమానమైన దూరం ఉండాలని అలా లేదని పేర్కొన్నారు. దీనిని బట్టి భూమి దీర్ఘవృత్తాకారం ఉందనే విషయాన్ని బలపరుస్తున్నట్లు ఆ జర్నల్ లో పేర్కొన్నారు.
భూమి లోపలి పొరల్లో ఉన్న వైరుధ్యాలు, సరైన సమతుల్యత లేని కారణంగా అనేక మార్పులు జరుగుతున్నాయని, భూమి పొరలైన క్రస్ట్, మాంటిల్ అస్తవ్యస్తంగా ఉండడం కూడా భూమి రూపాన్ని మార్చడంలో కీలకంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కారణంగా పర్వత ప్రాంతాలలో భూమి లోపలి పొరల్లో హెచ్చుతగ్గుల కారణంగా భారీ మార్పులు చేసుకొని భూమి ఆకారానాన్ని నిర్దేసిస్తున్నాయని తెలిపారు. ఇలా బలమైన రిజన్స్ భూమి దీర్ఘవృత్తాకారంలో ఉందని చెప్పడానికి బలాన్ని ఇస్తున్నాయని జర్నల్ లో పేర్కొన్నాయి. మరి ఈ థియరీ ప్రకారం భూమి గుండ్రంగా లేదనే విషయాన్ని ప్రపంచం ఒప్పుకుంటుందా, భవిష్యత్తులో భూమి ఆకారాన్ని మార్చి చూపించే ప్రయత్నం చేస్తారా అనేది వేచి చూడాలి.