Dubai : ఒక లాటరీ టిక్కెట్టు అతని జీవితాన్నే మార్చేసింది. అదృష్టం కోరి మరీ అతని ఇంటి తలుపుతట్టింది. సరదాకి కొన్న టికెట్టు కాస్త కోట్లు తెచ్చిపెట్టడంతో ఆ అదృష్టవంతుడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇంతకి కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలా మంది తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు, కష్టపడకుండానే ధనలక్ష్మిని పొందేందుకు లాటరీ టికెట్లను కొంటుంటారు. అయితే ఈ లాటరీ టిక్కెట్లు నిజంగా లక్ తెచ్చిపెడతాయా అంటే అవుననే అనిపిస్తుంది ఈ ఇన్సిడెంట్ చూస్తే. అబుదాబీలో ఉండే భారత ప్రవాసుడు జయకృష్ణా ఏదో పని నిమిత్తం లండన్ వెళుతున్నాడు. ఈ క్రమంలో ఫ్లైట్ ఎక్కేందుకు దుబాయ్ ఎయిర్‌పోర్ట్ కు చేరుకున్నాడు. అక్కడ దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలినియం మిలియనీర్ లాటరీ గురించి తెలుసుకుని సరదాగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు లాటరీ టికెట్టు కొనుగోలు చేశాడు. టికెట్టు అయితే కొనుగోలు చేశాడు కానీ అది లక్కుతో పాటు లక్ష్మీని తెచ్చి పెడుతుందని అనుకోలేదు. బుధవారం నిర్వహించిన లక్కీ డ్రాలో ఈ భారతీయుడి జాక్‌పాట్ తగిలింది. ఏకరంగా 1 మిలియన్ డాలర్లు అతని వాలెట్ లోకి చేరిపోయాయి. ఇండియన్ కరెన్సీలో 1 మిలియన్ డార్లు అంటే అక్షరాలా 8 కోట్ల 23 లక్షల రూపాయలు.

జయ కృష్ణ స్వస్థలం భారతదేశంలోని కేరళ రాష్ట్రం. అయితే ఉపాధి నిమిత్తం కొన్నేళ్ల క్రితమే భార్య, పిల్లలుతో అబుదాబీ వచ్చేశాడు. దీరాలోని ఓ ప్రైవేటు కంపెనీలో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు జయకృష్ణ. ఈ క్రమంలోనే ఫ్యామిలీతో కలిసి లండన్ వెకేషన్ ట్రిప్‌ను ప్లాన్ చేసి దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌కు ఫ్లై ఎక్కేందుకు వెళ్లాడు. ఆ సమయంలో 407 సీరీస్ తో వచ్చిన లక్కీ టికెట్టును కొనుగోలు చేశాడు. ఈ టిక్కెట్టుకే 8 కోట్ల రూపాయల లక్కీ డ్రా తగిలింది. డ్యూటీ ఫ్రీ రాఫెల్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్&సీఈఓ కోల్మ్ మెక్‌లౌగ్లిన్ లు ఈ అదృష్టవంతుడికి ఆ డబ్బు మొత్తాన్ని అందించారు. అయితే జయకృష్ణ కు లాటరీ టికెట్లు కొనడం కొత్తేమి కాదు గతంలోనూ అనేక సార్లు టిక్కెట్లను కొనుగోలు చేశాడు. తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు . కానీ పెద్దగ ప్రమోజనం లేకపోయింది. ఇదే క్రమంలో మరోసారి దుబాయ్ లో టికెట్ కొనడం అది బంపర్ డ్రాలో సెలెక్ట్ కావడంతో జయకృష్ణ ఆనందానికి అవధులు లేవు.
చాలా సంవత్సరాలుగా లాటరీ టికెట్ కొనుగోలు చేస్తున్నానని ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో డబ్బు రావడం చాలా ఆనందంగా ఉందని జయకృష్ణ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. డ్యూటీ ఫ్రీ తన లాంటి చాలా మంది ప్రజల జీవితాలను ఒక్కసారిగా మార్చేస్తుందని అందుకు ఎగ్జాంపిల్ తానేనని చెప్పుకొచ్చాడు.