మలయాళంలో సూపర్ హిట్ అయిన దృశ్యం మొదటి భాగాన్ని తెలుగులో రీమేక్ చేసి సూపర్ హిట్ ను అందుకున్న విక్టరీ వెంకటేష్ తాజాగా దృశ్యం సీక్వెల్ చేశారు.ఈ మూవీ లేటెస్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది.మరి ఆ మూవీ రివ్యూ గురించి ఇప్పుడు చూద్దాం.
ఈ మూవీ కథ విషయానికి వస్తే :
తన ఇంట్లో హత్యకు గురైన వరుణ్ అనే కుర్రాడి శవాన్ని రాంబాబు (వెంకటేశ్) కన్ స్ట్రక్షన్ లో ఉన్న పోలీస్ స్టేషన్ లో పాతిపెట్టడంతో ‘దృశ్యం’ మూవీ ముగిసింది.ఈ కేసులో నిర్దోషిగా బయటపడిన రాంబాబు ఫ్యామిలీ ఉన్నత జీవితాన్ని గడుపుతుంటుంది. కెబుల్ బిజినెస్ చేసే రాంబాబు.. అంచెలంచెలుగా ఎదిగి సినిమా థియేటర్ ఓనర్ అవుతాడు. అంతేకాదు ఏకంగా ఓ సినిమాను నిర్మించేందుకు రంగంలోకి దిగుతాడు. ఇలా వారి జీవితం సాఫీగా సాగుతున్నప్పటీకీ.. వరుణ్ కేసు తాలూకు భయాలు మాత్రం అతడి కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంటాయి. పోలీసులు ఎక్కడ కనిపించినా చాలు రాంబాబు భార్య జ్యోతి(మీనా, పిల్లలు అంజు (కృతిక), అను( ఏస్తర్ అనిల్) భయంతో వణికిపోతుంటారు. ఇదే క్రమంలో రాంబాబు జీవితంలోకి మళ్లీ పోలీస్ ఆఫీసర్ గీతా ప్రభాకర్ (నదియా), ప్రభాకర్ (నరేష్) మళ్లీ ప్రవేశిస్తారు.ఎలాగైనా రాంబాబు మీద పగ తీర్చుకోవాలని భావించిన గీత… తన స్నేహితుడు, ప్రస్తుతం ఐజీపీగా ఉన్న గౌతమ్ సాహు(సంపత్ రాజ్)సహాయంతో మళ్లీ ఆ కేసును రీఓపెన్ చేయిస్తుంది. మరి వరుణ్ కేసులో పోలీసులకు దొరికిన ఆధారాలేంటి? కేసు నుంచి తన ఫ్యామిలీని కాపాడుకునేందుకు రాంబాబు ఎలాంటి ఎత్తులు వేశాడు? ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? సరికొత్త సాక్ష్యాలతో రాంబాబు కుటుంబాన్ని కోర్టుకు ఈడ్చినప్పుడు ఈసారి అతను ఎలా బయటపడ్డాడు అనేదే ‘దృశ్యం 2’కథ.
ఇక పర్ఫామెన్స్ ల విషయానికి వస్తే :
వెంకటేష్ సింగిల్ హ్యాండ్ గా ఈ మూవీని మోశారు.మీనా,నదియా,నరేష్,సంపత్ రాజ్,తనికెళ్ల భరణి తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు.డబ్బింగ్ కాస్త ఇబ్బందిగా ఉంది.ఫస్ట్ ఆఫ్ లో వచ్చిన కొన్ని సన్నివేశాలు ఇబ్బందికరంగా ఉన్నాయి.కథ,కథనం,మూవీ క్లైమాక్స్ సినిమాకి హైలైట్ గా నిలిచాయి.