Drink for Weight Loss: మనలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉంటారు. లేదంటే చాలామంది సన్నగా, నాజూకుగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. దీంతో తాము ప్రస్తుతం ఉన్న బరువు తగ్గాలని, అందుకు ఏవేవో మార్గాలను వెతుకుతూ ఉంటారు. కొందరు ఆహారం తీసుకోవడం తగ్గిస్తే మరికొందరు రకరకాల వ్యాయామాలు చేస్తుంటారు. అయితే ఒకవేళ మీరు కూడా బరువు తగ్గాలని ప్రయత్నిస్తుంటే ఉదయాన్నె ఒక డ్రింక్ తాగితే సరిపోతుంది.
అవును, మీరు చదివింది నిజమే. ఒక డ్రింక్ ని ఉదయాన్నె లేచిన వెంటనే తాగితే మీ బరువు అమాంతం తగ్గుతుందట. ఇంతకీ మీరు బరువు అంత అద్భుతంగా తగ్గించే ఆ డ్రింక్ ఏంటని ఆలోచిస్తున్నారా? అది పసుపు టీ. ఉదయం పూట ఈ పసుపు టీని తాగడం వల్ల పొట్ట చుట్టూ పేరుకొని పోయిన కొవ్వు కరిగిపోతుంది. అలాగే జీర్ణసమస్యలైన గ్యాస్, ఉబ్బరం లాంటి సమస్యల నుండి ఉశమనం కూడా కలుగుతుంది.
ఆయుర్వేదంలో పసుపు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గాయాలకు యాంటీ సెప్టిక్ గా పని చేస్తుంది. హార్మోన్లను సమతుల్యం చేయడంతో పాటు థైరాయిడ్, కొలెస్ట్రాల్, మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది మేలు చేస్తుంది. అలాగే ఆర్థరైటిస్ తో బాధపడే వారు కూడా పసుపు టీని తాగడం వల్ల ప్రయోజనాలు పొందవచ్చు.
Drink for Weight Loss:
పసుపు టీ తయారీ విధానం:
ఒక కప్పులో 1/4 టీస్పూన్ పసుపును తీసుకొని, దానికి వేడి నీటిని కలపండి. దీనిని 5 నుండి 7 నిమిషాల వరకు బాగా మరిగించండి. ఆ తర్వాత దానిని మామూలు టీగా వేడివేడిగా తాగాలి. ఇలా 15 రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే ఆరోగ్యంగా బరువు తగ్గుతారట. అయితే పసుపు టీని రోజులో ఒకసారి కంటే ఎక్కువ సార్లు తాగకూడదని సలహా ఇవ్వబడుతోంది.