Bigg boss 6 : బిగ్‌బాస్ సీజన్ 6 తెలుగు ఆరవ వారం కూడా పూర్తి కావడానికి వచ్చింది. నిన్నటితో బిగ్‌బాస్ హౌస్ న్యూ కెప్టెన్ ఎవరో తేలిపోయింది.ఫైనల్ డెసిషన్ ఇంటి సభ్యులపైనే బిగ్‌బాస్ పెట్టడంతో అంతా సూర్యను కెప్టెన్‌గా ఎంచుకున్నారు. ఇక ఇతని కెప్టెన్సీ ఎలా ఉంటుందనే విషయాన్ని పక్కన బెడితే.. ఇవాళ ఉదయం లగ్జరీ బడ్జెట్ టాస్క్ నిర్వహించే అవకాశం ఉంది. ఇక వీకెండ్ రానే వచ్చింది. ఇవాళ హోస్ట్ నాగార్జున వచ్చి కడగాల్సిన వారందరినీ కడిగేసి.. పువ్వులు వేయాల్సిన వాళ్లపై పువ్వులు వేసి కొన్ని టాస్కులు ఆడించి.. ఒకరిద్దరినీ సేవ్ చేస్తారు.
ఇక రేపు ఫన్ డే సన్ డే.. దీనిలో భాగంగా మాంచి గేమ్స్ ఆడించి అందరినీ ఖుషీ చేస్తారు. ఆ తరువాత అసలైన ప్రోగ్రాం ఉంటుంది. అదేనండి ఎలిమినేషన్. ఇక్కడే ఈసారి పెద్ద ట్విస్టే ఉన్నట్టు తెలుస్తోంది. ఈసారి డేంజర్ జోన్‌లో దాదాపు నలుగురు ఉన్నట్టు తెలుస్తోంది.వీరిలో ఎవరు నిలుస్తారు..? ఎవరు ప్రేక్షకుల ఓట్లకు తలొగ్గి బయటకు వెళ్లిపోతారు? అనేది తేలాల్సి ఉంది. అయితే ఈ వారం బిగ్‌బాస్ మరో ట్విస్ట్ కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అదే డబుల్ ఎలిమినేషన్.
డబుల్ ఎలిమినేషన్ కార్యక్రమాన్ని బిగ్‌బాస్ నిర్వహించనున్నట్టు టాక్ నడుస్తోంది.ఒకరిని సీక్రెట్ రూంలోకి పంపించనున్నట్టు సమాచారం. అలా పంపించాలి అంటే గట్టి క్యాండిడేట్.. అంటే స్ట్రాంగ్‌గా నోరు తెరవగల క్యాండిడేట్‌ను పంపించాలి. అలా అయితే ఏ రేవంత్‌నో.. గీతూనో పంపించాలి. కానీ వీరిద్దరిలో ఎవరిని పంపించినా ఇతర ఇంటి సభ్యులు పట్టేస్తారు.ఇక మిగిలిన వాళ్లలో కాస్త గట్టిగా మాట్లాడగలిగేవారు.. సుదీప, శ్రీ సత్య. వీళ్లిద్దరిలో ఎవరిని సీక్రెట్ రూంలోకి పంపించినా కూడా బిగ్‌బాస్‌కు కావల్సినంత కంటెంట్ ఇస్తారనడంలో సందేహం లేదు. మరి నిజంగానే సీక్రెట్ రూంలోకి పంపిస్తారా? లేదంటే సింగిల్ ఎలిమినేషన్ చేసి చేతులు దులుపుకుంటారా? అనేది చూడాల్సి ఉంటుంది.