Surya 42: ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించి లీక్ బెడద పెద్ద ఆటంకంగా మారిపోయింది. కొన్ని కోట్లు ఖర్చుపెట్టి షూటింగ్ చేస్తున్న సమయంలో వీడియోలు ఇంకా ఫోటోలు బయటకు వచ్చేయటం.. నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఈ రీతిగా గత ఏడాది RRR, పుష్ప సినిమా రిలీజ్ కాకముందే హీరోల వేషధారణకు సంబంధించిన ఫోటోలు కొన్ని వీడియోలు బయటకు వచ్చేసాయి. రీసెంట్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన “సలార్” పిక్స్ కూడా లీక్ అయ్యాయి. తాజాగా ఇప్పుడు ఇదే జాబితాలోకి సూర్య 42వ సినిమా చేరింది. సూర్య కారియర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ స్పాట్ లో నుండి వీడియోలు మరియు ఫోటోలను కొందరు షేర్ చేస్తున్నట్లు గుర్తించినట్లు సినిమా యూనిట్ ప్రకటన చేసింది. ఇక ఇదే సమయంలో సినిమా యూనిట్ మొత్తం రక్తం ఇంకా చెమటను ధారపోసి.. ఈ సినిమా చిత్రీకరిస్తున్నం. సినిమా ధియేటర్రికల్ అనుభూతి అందించడానికి అందరూ కృషి చేస్తున్నారు.
దయచేసి ఎవరైతే సినిమాకి సంబంధించి వీడియోలు మరియు ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారో… వెంటనే డిలీట్ చేస్తే మాకు ఎంతో మంచి చేసిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా ఈ ఫోటోలు మరియు వీడియోలను భవిష్యత్తులో షేర్ చేయొద్దని కూడా కోరుకుంటున్నాము. మా అభ్యర్థనను కాదని ఎవరైనా ఇదే 12 కొనసాగిస్తే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిర్మాణ సంస్థ.. తాజాగా ప్రకటన చేయడం జరిగింది. దర్శకుడు శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. సూర్య డిఫరెంట్ రోల్ లో కనిపించనున్నారు.
బాలీవుడ్ బ్యూటీ దిశాపటాని సూర్యకి జోడిగా నటిస్తూ ఉంది. అయితే బీచ్ ఒడ్డున.. రెస్టారెంట్ లో హీరో హీరోయిన్ సన్నివేశానికి సంబంధించి.. ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే చిత్ర బృందం అలర్ట్ అయింది. సినిమా నిర్మాణ భాగస్వామ్యంలో సూర్య బ్యానర్ స్టూడియో గ్రీన్ కూడా భాగస్వామ్యం కావటంతో టీం సూర్య పేరిట చేతులెత్తి మొక్కినట్టు… ప్రకటన విడుదల చేయటం కోలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.