Punch Prasad : జబర్దస్త్ కమెడియన్స్‌లో రామ్ ప్రసాద్ తర్వాత ఆ రేంజ్‌లో పంచ్‌లు పేల్చగలిగిన వ్యక్తి ప్రసాద్. అందుకే ఆయన ‘పంచ్’ ప్రసాద్‌గా స్థిరపడిపోయాడు. అనారోగ్య సమస్యలు తనను చుట్టుముట్టినా కూడా అందరినీ చక్కగా నవ్విస్తూ తన జీవితంలోని విషాదాన్ని దరి చేరనివ్వడు. కొంతకాలంగా కిడ్నీ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్న పంచ్ ప్రసాద్ ఆరోగ్యం తాజాగా సడెన్‌గా క్షీణించింది. అతని వెన్ను భాగం నుంచి కాళ్లకు చీము రావడంతో కనీసం లేచి నడిచే పరిస్థితి లేకుండా పోయింది.
తన పరిస్థితిని ఎవరికీ తెలియనివ్వొద్దని పంచ్ ప్రసాద్ కోరినప్పటికీ అతడిని ఒప్పించి నూకరాజు అతని ఆరోగ్యం గురించి ఒక వ్లాగ్ చేసి యూట్యూబ్‌లో పోస్ట్ చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునన వారంతా అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.ఇంత మంది అభిమానుల కోరికలు ఫలించినట్టున్నాయి. పంచ్ ప్రసాద్ ప్రస్తుతం కాస్త రికవరీ అయ్యాడట. దీనికి సంబంధించి నూకరాజు మరో వీడియో షేర్ చేశాడు.
నిన్న మొన్నటి వరకూ పంచ్ ప్రసాద్ లేచి నిల్చొనే పరిస్థితిలో కూడా లేడు. కానీ ప్రస్తుతం కర్ర, ఒకరి సాయంతో లేచి నడవగలుగుతున్నాడని నూకరాజు తెలిపాడు. ప్రస్తుతం పంచ్ ప్రసాద్ ఇంట్లోనే ఉన్నాడని.. ప్రత్యేకంగా ఒక నర్స్ ఇంట్లోన ఉంటూ చికిత్సను అందిస్తోందని నూకరాజు వెల్లడించాడు. మరో వారం రోజులు గడిస్తే కానీ అతను నడవగలడా? లేదా? అనేది వైద్యులు చెబుతామన్నారని తెలిపాడు. ప్రస్తుతం డైలీ పంచ్ ప్రసాద్‌కి సెలైన్స్ ద్వారా యాంటిబయాటిక్స్ ఇస్తున్నారని వెల్లడించాడు.