Doctor Tip: మనలో కొంతమందికి లేదంటే మనకే కొన్నిసార్లు వింత అనుభవం ఎదురవుతుంది. పూర్తిగా నిద్రపోయినా కూడా కొంతమందికి బద్దకంగా అనిపిస్తూ ఉంటుంది. రాత్రి మొత్తం ప్రశాంతంగా నిద్రపోయినా కానీ ఉదయం మాత్రం బద్దకంగా, అలసటగా లేదంటే నీరసంగా ఉంటూ ఉంటుంది. ఇలా ఉంటే కొన్ని చిట్కాలు పాటించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. అవేంటో ఇక్కడ చూడండి.
త్వరగా నిద్రలేవండి:
బాగా నిద్రపోయిన తర్వాత కూడా బాగా బద్దకంగా ఉంటే, దీనిని నివారించడానికి ఉదయం పూట త్వరగా నిద్రలేవాలి. మామూలుగా ఉదయం పూట 6గంటలకు ముందు నిద్రలేస్తే మంచిది అని నిపుణులు చెబుతుంటారు. కొత్తగా ఈ అలవాటు అలవడేందుకు కాస్త ఇబ్బందిపడినా కానీ తర్వాత తర్వాత అలవాటు అవుతుంది.
మసాజ్ చేయండి:
బద్దకంగా ఉండే వ్యక్తులు మసాజ్ చేయించుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది. ప్రతిరోజు 20-25 నిమిషాలు మంచి నూనెతో బాడీ మసాజ్ చేస్తే ఫలితాలు బాగుంటాయి.
ధ్యానం, యోగా:
చాలామందికి బద్దకంగా ఉంటే ధ్యానం లేదంటే యోగా చేయడం మంచిది. రెగ్యులర్ గా ధ్యానం లేదంటే యోగా చేయడం వల్ల శరీరం తిరిగి యాక్టివ్ గా అవుతుంది.
Doctor Tip: వేడి ఆహారం తినడం:
బద్దకంతో బాధపడే వారు రెగ్యులర్ గా వేడిగా ఉండే ఆహారాన్ని తినాలి. వేడివేడి ఆహారాన్ని తినడం వల్ల శరీరం యాక్టివ్ గా ఉంటుంది.