Akkineni Nagachaithanya: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ కుటుంబాలలో అక్కినేని ఫ్యామిలీ ఒకటి. అక్కినేని నాగేశ్వరరావు స్టార్ డామ్ తో.. ఆయన వారసుడిగా అక్కినేని నాగార్జున ఎంట్రీ ఇచ్చి.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. నాగ్ తన కెర్రిర్ లో పెద్దగా తండ్రి పలుకుబడి ఉపయోగించుకోకుండా తన సొంత ఆలోచనలతో.. సినిమా ఇండస్ట్రీలో విజయవంతంగా రాణించారు. ఒక సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు వ్యాపార రంగంలో సైతం నాగార్జున సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత నాగ్ తన వారసులుగా ఇద్దరు కొడుకులను నాగచైతన్య, అఖిల్ లని ప్రస్తుతం ఫీల్డ్ లోకి దింపడం తెలిసిందే.
ఇద్దరిలో ముందు నాగచైతన్య ఎంట్రీ ఇచ్చి తనకంటూ సపరేటు ఇమేజ్ అభిమానులలో క్రియేట్ చేసుకోవడం జరిగింది. అఖిల్ లేటుగా వచ్చినా గాని.. చేస్తున్న సినిమాలతో పరవాలేదు అనిపిస్తున్నాడు. ఇంకా అక్కినేని కుటుంబం నుండి నాగార్జున మేనల్లుడు సుమంత్ ఇంకా అక్కినేని సుశాంత్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కానీ ఇద్దరు పెద్దగా క్లిక్ అవ్వలేదు. అక్కినేని సుమంత్ చాలాకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉండగా ఇటీవల “సీతారామం” లో నెగిటివ్ పాత్ర చేసి రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే అఖిల్ కాకుండా నాగచైతన్యకి మరొక బ్రదర్ ఉన్నారట. పూర్తి విషయంలోకి వెళ్తే అక్కినేని నాగేశ్వరరావు పెద్ద కొడుకు వెంకట్ ఉన్న సంగతి తెలిసిందే. పెద్దగా అయిన పేరు వినకపోయినా గానీ సినిమా రంగంలో నిర్మాతగా ఆయన పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.
ఈయనకి ఆదిత్య అనే కొడుకు ఉన్నాడు. ఫ్యామిలీలో అందరూ సినిమా ఇండస్ట్రీ వైపు చూసినా గాని ఈ ఆదిత్య మాత్రం.. ఇప్పటివరకు మీడియా ముందు కనబడలేదు. ఇదే సమయంలో సినిమా ప్రపంచానికి చాలా దూరంగా ఉంటాడట. కానీ కార్ రేసులంటే చాలా ఇష్టం అంట. చూడటానికి అచ్చం నాగచైతన్య మాదిరిగా ఉంటాడట. అక్కినేని ఆదిత్య తన జీవితంలో కార్ రేసర్ గా సెటిల్ అవ్వాలని ఆలోచనలో ఉన్నారట. అందుకే ఇండస్ట్రీలో వచ్చే అవకాశాలు ఉన్నాగాని కార్ రేసింగ్ వైపే మొగ్గు చూపుతున్నాడట. ఇక అక్కినేని ఫ్యామిలీలో కార్ రేసింగ్ అంటే నాగచైతన్యకి కూడా చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే.