పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సూపర్ డూపర్ హిట్ మూవీ తొలి ప్రేమ రీ రిలీజ్ మానియా తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయింది. మూవీ రిలీజై 25 ఏళ్లయిన సందర్భంగా శుక్రవారం (జూన్ 30) ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసారి 4కే క్వాలిటీతో సినిమాను తీసుకొస్తున్నారు.
అయితే ఈ సినిమాకు పవన్ కల్యాణ్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ఈ మధ్యే మూవీ ప్రొడ్యూసర్ జీవీజీ రాజు ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇప్పుడైతే పవన్ ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోల్లో ఒకడు. కానీ అప్పుడప్పుడే టాలీవుడ్ లో తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్న పవన్ చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడు.

తొలిప్రేమ రెమ్యూనరేషన్ తో పవన్ కళ్యాణ్ :
అది కూడా సినిమా రిలీజైన తర్వాతే అని నిర్మాత జీవీజీ రాజు చెప్పాడు. రిలీజ్ కు ముందు పవన్ కేవలం తన నెలవారీ ఖర్చులకు మాత్రం ఎంతోకొంత ఇవ్వండి.. మిగతాది రిలీజ్ తర్వాత ఇచ్చినా సరే అని అన్నాడట. కరుణాకరన్ డైరెక్షన్ లో పవన్, కీర్తి రెడ్డి కలిసి నటించిన తొలి ప్రేమ అప్పట్లో టాలీవుడ్ లో ఓ సంచలనం. రొమాన్స్, కామెడీ, డ్రామా, ఎమోషన్ అన్నీ కలగలసిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది.
ఇప్పుడు మూవీ రీరిలీజ్ సందర్భంగా తొలి ప్రేమ విశేషాలను ప్రొడ్యూసర్ జీవీజీ రాజు షేర్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఈ సినిమాకు పవన్ రెమ్యునరేషన్ అంశం తెరపైకి వచ్చింది. “రెమ్యునరేషన్ ఎలా తీసుకుంటావని నేను పవన్ ను అడిగాను. మొత్తం ఒకేసారి ఇవ్వాలా, వాయిదాల్లో ఇవ్వాలా అని అడిగాను. మీ ఇష్టం అని అతడు అన్నాడు.
ముందు కొంత ఇచ్చి రిలీజ్ తర్వాత మిగతా మొత్తం ఒకేసారి ఇస్తానని చెప్పాను. సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకూ నెలవారీ ఖర్చులకు కాస్త ఇచ్చి మిగతాది తర్వాత ఇచ్చినా సరే అని పవన్ అన్నాడు. నేను సరే అన్నాను. సినిమా రిలీజైన రెండు రోజుల తర్వాత పవన్ కు పూర్తి రెమ్యునరేషన్ ఇచ్చేశాను” అని ప్రొడ్యూసర్ జీవీజీ రాజు చెప్పాడు.
ఇప్పుడతని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌సీస్‌లో భారీగా ఈ సినిమాను స్క్రీనింగ్ చేసేలా పవన్ ఫ్యాన్స్ ఏర్పాట్లు చేస్తోన్నట్లు సమాచారం. తొలి ప్రేమ సినిమాలో సిన్సియర్ లవర్‌గా పవన్ యాక్టింగ్, మేనరిజమ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇందులో పవన్‌కు జోడీగా కీర్తిరెడ్డి హీరోయిన్‌గా నటించింది. తొలి ప్రేమ సినిమాకు దేవా సంగీతాన్ని అందించాడు.
ఈ సినిమాలోని పాటలు మ్యూజిక్ లవర్స్‌ను మెప్పించాయి. 1998 ఏడాదికిగాను బెస్ట్ తెలుగు మూవీగా తొలి ప్రేమ నేషనల్ అవార్డును అందుకున్నది. ఆరు నంది అవార్డులను దక్కించుకొంది. కాగా రీ రిలీజ్ సినిమాల్లో పవన్ కళ్యాణ్ ఖుషి, జల్సా సినిమాలు అద్భుతమైన వసూళ్లను రాబట్టాయి. ఆ జోష్‌ను తొలి ప్రేమ కూడా కంటిన్యూ చేసే అవకాశం ఉందని పవన్ ఫ్యాన్స్ భావిస్తోన్నారు.