Nayanthara : తమిళంలో లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన నయనతార.. చాలా లవ్ ఫెయిల్యూర్ ల తర్వాత డైరెక్టర్ విఘ్నేష్ ని పెళ్లి చేసుకుంది. చాలా సంవత్సరాల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. గతేడాది తక్కువ మంది సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న నయనతార.. చివరకు తన జీవితాన్ని విఘ్నేష్ తో పంచుకోవాలని నిర్ణయించుకొని.. ఏడు అడుగులు వేసింది.
గతేడాది మహాబలేశ్వరంలోని ఓ ప్రైవేట్ రిసార్ట్ లో అట్టహాసంగా పెళ్లి చేసుకున్న ఈ జంట.. అక్టోబర్ 9వ తేదీన ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చారు. అయితే వీరిద్దరు సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనివ్వగా.. విఘ్నేష్ అధికారికంగా తన ట్విట్టర్ ఖాతాలో ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ పోస్ట్ పెట్టాడు.
నయనతార, విఘ్నేష్ లకు పుట్టిన పిల్లలకు సంబంధించిన వార్తను చెబుతూనే… వారికి ఏం పేరు పెట్టారనే విషయాన్ని కూడా విఘ్నేష్ తన పోస్ట్ ద్వారా వెల్లడించాడు. ఇద్దరు మగ పిల్లలకు ఉయిర్, ఉలగం అని పేర్లు పెట్టినట్లు తెలిపాడు. అయితే పూర్తిగా తమిళ భాషలకు చెందిన ఈ పేర్లకు అర్థాలేంటని అందరూ వెతకడానికి ఆసక్తి చూపించారు. కాగా ఉయిర్ అంటే జీవితం అని, ఉలగం అంటే ప్రపంచం అని అర్థం అట.
https://twitter.com/VigneshShivN/status/1579094363095052288?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1579094363095052288%7Ctwgr%5Ef7e1f5a9baa27719b94bc109906e6a2472b179a9%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftimesofindia.indiatimes.com%2Fentertainment%2Ftamil%2Fmovies%2Fnews%2Fnayanthara-and-vignesh-shivan-blessed-with-twin-boys%2Farticleshow%2F94743722.cms
Nayanthara :
మరోపక్కన నయనతార, విఘ్నేష్ లు పండంటి పిల్లలకు జన్మనివ్వడంతో అందరూ వారు బాగుండాలని సోషల్ మీడియా వేదికగా దీవిస్తున్నారు. బాలీవుడ్ కు చెందిన విక్కీ కౌశల్, అర్జున్ కపూర్ లు అభినందనలు తెలిపారు. అటు హీరోయిన్ కాజల్ అగర్వాల్ దీనిపై స్పందిస్తూ.. ‘నయన్, విక్కీకి అభినందనలు, పేరెంట్ క్లబ్ కి స్వాగతం. జీవితంలో అత్యుత్తమ దశ. మీ ఇద్దరు పిల్లలకు నా ఆశీర్వాదాలు’ అని పేర్కొంది.