BIGG BOSS: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మొత్తానికి ఐదో వారంలోకి అడుగు పెట్టి ఈ వారానికి సంబంధించిన నామినేషన్లు కూడా పూర్తి చేసుకుంది. ఇక మంగళవారం ఎపిసోడ్ లో ఎప్పటి మాదిరిగానే బిగ్ బాస్ పోటీదారుడు ఎవరు అవ్వాలి అనే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఈ ఎపిసోడ్ లో నిద్రలేవగానే బిగ్ బాస్ బర్త్ డే కోసం హౌస్ ని అందరంగా డెకరేట్ చేసి ఉంటారు. హౌస్ సభ్యులు అందరూ నిజంగానే ఈరోజు బిగ్ బాస్ పుట్టిన రోజునా అని కాసింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు.
దీంతో బిగ్ బాస్ పుట్టిన రోజుకు సంబంధించిన కార్యచరణ గురించి హౌస్ లో ఆదిరెడ్డి చదివి వినిపిస్తాడు. తన పుట్టినరోజు వేడుక సందర్భంగా బిగ్ బాస్ ను ఎంటర్ టైన్ చేయడం ఇంటి సభ్యుల బాధ్యత. సమయానుసారం బిగ్ బాస్ ఇంటి సభ్యులకు కొన్ని సర్ ప్రైజ్ లు పంపడం జరుగుతుంది. ఈ సర్ ప్రైజెస్ లో ఇంటి సభ్యులు అందరూ పూర్తి మనసు మరియు ఉత్సాహంతో పాల్గొనాల్సి ఉంటుంది.

కేవలం బిగ్ బాస్ సర్ ప్రైజ్ లు పంపినప్పుడే కాకుండా ఈ పూర్తి వేడుకలో బిగ్ బాస్ ఎల్లప్పుడూ ఎంటర్ టైన్ అవుతూ ఉండేలా ఇంటి సభ్యులు చూసుకోవాల్సి ఉంటుంది. మీరు బిగ్ బాస్ ని ఎంత ఎంటర్ టైన్ చేస్తే మీరు కెప్టెన్సీ పోటీదారులు అయ్యే అవకాశాలు అంత మెరుగు పడతాయంటూ బిగ్ బాస్ ఈ వారం టాస్క్ ప్లాన్ చేస్తాడు.
తర్వాత బిగ్ బాస్ బర్త్ డే సందర్భంగా ఓ కేక్ ని పంపిస్తాడు .ఈ కేక్ కేవలం ఇద్దరు సభ్యులు మాత్రమే తినవచ్చు. ఏ ఇద్దరు సభ్యులు తినాలో ఇంటి సభ్యులు అందరు కలిసి నిర్ణయించాల్సి ఉంటుందని రూల్ పెడతాడు బిగ్ బాస్. దీంతో ఆ కేక్ ను సంపాదించడం కోసం కంటెస్టెంట్స్ అందరూ నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తారు. ఇలా ఈ ఎపిసోడ్ మొత్తం బిగ్ బాస్ ని ఎంటర్ టైన్ చేస్తే టాస్క్ కొనసాగుతూ సాగింది.