BIGG BOSS: బిగ్ బాస్ హౌస్ లో సూర్య, ఆరోహి మధ్య లవ్ ట్రాక్ నడిపేందుకు బిగ్ బాస్ పడుతున్నఅవస్థలు అన్నీ ఇన్నీ కావు అని మనం గతంలోనే ముచ్చటించుకున్నాము. బిగ్ బాస్ ప్రయత్నం చేయకపోయినా వీరి మధ్య బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ రిలేషన్ కొనసాగుతోంది. అది ఎలాంటి రిలేషన్ అనేది ఇప్పుడే క్లారిటీ ఇవ్వలేము. ఎందుకంటే వారు ఎప్పుడు ఏ మూడ్ లో ఉంటున్నారో వారికే అర్ధం కావడం లేదు.
ఓసారి ప్రేమగా కబుర్లు చెప్పుకుంటూ సరదా సరదాగా అల్లరి చేస్తూ హౌస్ లో సందడి సందడిగా ఉంటారు. మరోవైపు ఏ కోపం ఎక్కడ చూపించాలో తెలీక వీరిద్దరూ వీరి మీద ఒకరికి ఒకరు చూపించుకుంటూ ఏం చేస్తారో వారికే అర్ధం కాదు. ఈ క్రమంలో ఈ వీక్ లో ఓ సన్నివేశం జరిగి ఉంటుంది. అదేంటంటే…. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఒకరిపై ఒకరు కోపంతో డిన్నర్ చేస్తున్న క్రమంలో ఆరోహి అక్కడి నుండి అలిగి వెళ్లిపోతుంది. ఇక సూర్య తాను తింటున్న అన్నం మధ్యలో ఆపేసి కోపంగా చెత్త బుట్టలో పారవేస్తాడు.

దీంతో శనివారం ఎపిసోడ్ హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ముందుగా సూర్య చేసిన ఈ పని గురించే మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు. ఈ విషయంపై సూర్యతో పాటు ఈ వీక్ గా కెప్టెన్ గా వ్యవహరించిన ఆదిరెడ్డిని వివరణ అడుగుతాడు. కానీ సూర్య అన్నం పాడేసిన విషయం ఆదిరెడ్డికి తెలియదు. ఇక నేను ఆ పని చేయకుండా ఉండాల్సింది కానీ ఆ సమయంలో అంతలా కోపం వచ్చి అలా చేశాను క్షమించండని సూర్య నాగార్జునను కోరతాడు.
కానీ నాగార్జున ఈ విషయంలో చాలా సీరియస్ అవుతారు. ఈ క్రమంలో సూర్యకు ఒక పనిష్మెంట్ ఇస్తారు. ప్రస్తుతం హౌస్ కొత్త కెప్టెన్ కీర్తీ పనిష్మెంట్ ఇస్తుంది. అన్నం చెత్త బుట్టలో పారేసినందుకు ఒక రోజు పాటు సూర్య ఆరోహితో మాట్లాడకూడదు అని కీర్తీ డిసైడ్ చేస్తుంది. ఒక రోజు మొత్తం మాట్లాడటం కాదు కనీసం సైగలు చేసుకున్నా ఈ పనిష్మెంట్ రెండు రోజులకు పొడగించబడుతుందని నాగార్జున ప్రకటిస్తాడు.