Biggboss 6 : అంగరంగ వైభవంగా బిగ్‌బాస్ సీజన్ 6 నిన్న ప్రారంభమైంది. హౌస్ లోకి 21 మంది కంటిస్టెంట్‌లని కింగ్ నాగార్జున పంపించారు. వీరిలో కొంత మంది తెలిసిన ముఖాలు ఉన్నా మరి కొంత మంది మాత్రం కొత్తవాళ్లు ఉన్నారు. ఇప్పుడిప్పుడే కెరియర్ స్టార్ట్ చేసి బిగ్‌బాస్‌తో ఫేమ్ తెచ్చుకోవాలని అనుకుంటున్నవారే కావడం విశేషం. వారిలో రాజశేఖర్, అర్జున్ కళ్యాణ్, ఆరోహిరావు, ఇనయా సుల్తానా, శ్రీహాన్ లాంటివారు ఉన్నారు. వీరితో పాటు ఫేడ్ అవుట్ అయ్యి మళ్ళీ గ్రాండ్‌గా తనని తనకు పరిచయం చేసుకోవాలని అనుకుంటున్న అభినయశ్రీ షోకి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. లావుగా ఉండే ఆమె చాలా స్లిమ్ అయ్యి సరికొత్త లుక్‌లో దర్శనం ఇచ్చింది. ఇక పదో కంటెస్టెంట్స్‌గా రియల్ కపుల్ రోహిత్- మెరీనా వచ్చేశారు.
రోహిత్ – మెరీనా గురించి పూర్తి వివరాలు అతికొద్ది మందికి మాత్రమే తెలిసి ఉంటాయి. వేరు వేరే రాష్ట్రాలకు చెందిన వీళ్లు ఒక్కటి ఎలా అయ్యారో వాళ్ల ప్రేమ కథను స్టేజ్‌పై చెప్పుకొచ్చారు. మెరీనా పూర్తి పేరు మెరీనా అబ్రహం. ‘అమెరికా అమ్మాయి’ సీరియల్‌తో పాపులర్ అయిన మెరీనా ఆ తర్వాత ‘ఉయ్యాల జంపాల’ సీరియల్‌లో నటించింది. 2017 టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆన్ టీవీ అవార్డు గెలుచుకుంది. సీరియల్ ప్రియులకు ఈ అమ్మడు గురించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇక ఆమె భర్త రోహిత్ కూడా సీరియల్ నటుడే కావడం గమనార్హం. ఇద్దరూ కలిసి చాలా షోలలో అలరించారు కూడా.
Biggboss 6 : 2017లో పెళ్లి చేసుకున్నారు..
ఇక రోహిత్ విషయానికి వస్తే.. మోడల్‌గా తన కెరీర్ ప్రారంభించాడు. ‘నీలికలువలు’, ‘అభిలాష’, ‘కంటే కూతుర్నే కనాలి’ వంటి సీరియల్స్‌తో పాపులర్ అయ్యాడు. షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడిన ఈ జంట 2017లో పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరూ సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఇద్దరూ చాలా క్యూట్‌గా ఉండటంతో వీరికి అభిమానుల సంఖ్య కాస్తంత ఎక్కువే. ఇక బిగ్‌బాస్ సీజన్-3 మీకు గుర్తుండే ఉంటుంది. వరుణ్ అండ్ వితికా షెరులు జోడీగా హౌజ్‌లో అడుగుపెట్టి బాగా ఎంటర్‌టైన్ చేశారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే కపుల్ ఎంట్రీ ఉండనుంది. మరి ఈ జోడీ ప్రేక్షకుల మనసుల్ని ఎంతవరకు గెలుచుకుంటారు అన్నది చూడాల్సి ఉంది.