Flying Colours : నెలంతా షూటింగ్స్‌తో బిజీ బిజీ.. క్షణ క్షణం టెన్షన్.. ఇటు జీవితంలో ఇబ్బందులు.. అటు షూటింగ్స్‌లో ఇబ్బందులు.. తెరపై నవ్విస్తారు కానీ జీవితంలో నవ్వడమే మరిచిపోతారు. ఏం తింటున్నారో తెలియదు.. షూటింగ్స్ కోసం ఎక్కడ ఉండాల్సి వస్తుందో తెలియదు. హీరోల పరిస్థితికి భిన్నంగా ఉంటుంది కమెడియన్స్ పరిస్థితి. ఈ పరిస్థితుల నుంచి తమ కోసం ఒక్క రోజును కేటాయించుకున్నారు. ఆ రోజంతా నవ్వులకు తప్ప కష్టాలకు తావుండదు. కష్ట సుఖాలు పంచుకుంటారు తప్ప ఆ రోజు మాత్రం కష్టాన్ని దరి చేరనివ్వరు.
మంచి ఫుడ్.. మంచి ఆట.. చుట్టూ కడుపుబ్బ నవ్వించే ఫ్రెండ్స్.. అంతా కమెడియన్సే కావడంతో అక్కడ కామెడీకి కొదువ ఉండదు. దీనికోసం కొందరు కమెడియన్స్ అంతా కలిసి ఒక గ్రూప్‌గా ఏర్పాటయ్యారు. ఆ గ్రూప్ పేరే.. ‘ఫ్లైయింగ్ కలర్స్’. ఈ ఫ్లైయింగ్ కలర్స్ గురించి ఇప్పటికే ప్రేక్షకులకు బాగా తెలుసు. గత కొంతకాలంగా సెకండ్ సాటర్ డే వస్తే చాలు.. అంతా కలిసి ఒకచోటు చేరిపోతారు. మీటింగ్ అయిన ప్రతిసారి వీరంతా తమ పిక్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటారు. ఈ గ్రూప్‌లో శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, చిత్రం శ్రీను, సత్యం రాజేష్, సత్య, రఘు, ప్రవీణ్, ధనరాజ్, వేణు, నందు, నవీన్ ఉన్నారు. వీరంతా కలిసి తమ కోసం ఒక్క రోజును ఏర్పాటు చేసుకున్నారు.
ప్రతి నెలలో రెండవ శనివారం షూటింగ్స్ అన్నీ బంద్ ఉంటాయి. ఇదే రోజును తమ రిలాక్సేషన్‌కు డేట్‌గా ఫిక్స్ చేసుకున్నారు. అంతా కలిసి ఇండస్ట్రీలోని కష్టంలో ఉన్న వారికి తమ వంతు సాయం కూడా అందిస్తుంటారు. అలాగే ఈ నెల నుంచి ఫ్లైయింగ్ కలర్స్‌లో కలర్ మరింత పెరగబోతోంది. ట్విస్ట్ ఏంటంటే..ఈ నెల నుంచి మరో నిర్ణయం కూడా తీసుకున్నారు. తాము కలుసుకున్నప్పుడల్లా ఒక గెస్ట్‌ను సైతం ఆహ్వానించాలని భావించారు. ఈ వారం గెస్ట్‌గా కృష్ణ భగవాన్ వచ్చి సందడి చేశారు. అంతా కలిసి క్రికెట్ ఆడి.. తమకు ఇష్టమైన ఫుడ్ తిని జీవితంలోని కష్టాలను మరిచి హాయిగా ఎంజాయ్ చేశారు.