సిద్దు జొన్నలగడ్డ హీరోగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన డీజే టిల్లు ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి భారీ కలెక్షన్స్ ని ఈ సినిమా రాబట్టింది. ఇక హీరో సిద్దుకి కూడా కెరియర్ లో సాలిడ్ హిట్ ఇచ్చింది. గల్లీలలో తిరిగి టిల్లు క్యారెక్టర్ తో కావాల్సినంత ఫన్ ని సినిమాలో పండించారు. ఇక ఈ మూవీ హిట్ తో మళ్ళీ డీజే టిల్లు సీక్వెల్ కి సిద్దు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ చేసినట్లు టాక్ ఉంది. ఇదిలా ఉంటే దీపావళి సందర్భంగా ఈ సీక్వెల్ టైటిల్ ని ఇంటరెస్టింగ్ వీడియోతో అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు.
సీక్వెల్ కి టిల్లు స్క్వేర్ అనే టైటిల్ ని ఖరారు చేశారు. లాగే టిల్లు క్యారెక్టర్ లుక్ తో స్టైలిష్ గా ఫుల్ గా మందు కొట్టి షూటింగ్ కి వెళ్తున్నట్లు అక్కడ ట్రాఫిక్ పోలీస్ వాడిని ఆపడంతో వారితో డిస్కషన్ పెట్టుకొని తాను హీరో అని పరిచయం చేసుకోవడం, తన సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ అంటూ బిల్డ్ అప్ ఇవ్వడం తరువాత వారినే షూటింగ్ దగ్గర డ్రాప్ చేయమని చెప్పడం వంటి ఫుల్ ఎలిమెంట్స్ తో ఈ వీడియో చేశారు.
హైదరాబాద్ లో ఆ మధ్యకాలంలో ట్రాఫిక్ పోలీసులతో ఒక కుర్రాడు తాగిన మత్తులో చేసిన బిల్డ్ అప్ షోని రిఫరెన్స్ గా తీసుకొని ఈ వీడియో చేసి టిల్లు స్క్వేర్ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేశారు. అలాగే సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ అనే విషయాన్ని కూడా క్లారిటీ ఇచ్చారు. టైటిల్ అనౌన్సమెంట్ తోనే సిద్దు ఈ మూవీ ప్రమోషన్ లో చాలా కొత్తగా స్టార్ట్ చేసాడని వీడియో చూసిన అందరూ చెప్పే మాట. ఇప్పుడు ఈ టైటిల్ లాంచ్ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది.