Diya Mirza : దియా మిర్జా అందమైన ప్రతిరూపం అందరిని ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటుంది. ఈ నటి తన ఫ్యాషన్ డైరీలలోని స్నిప్పెట్‌లతో ఎప్పటికప్పుడు ఫ్యాషన్ లక్ష్యాలను అందిస్తూ ఉంటుంది. చీరల నుండి క్యాజువల్ డ్రెస్ ల వరకు, స్థిరమైన ఫ్యాషన్ ను తన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ ద్వారా పరిచయం చేస్తుంది. తాజాగా దియా ఓ అవార్డుbవేడుకలో తన రెడ్ కార్పెట్ లుక్ నుండి కొన్ని చిత్రాలను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. ఈ పిక్స్ ఫ్యాన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయ్. నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

Diya Mirza :దియా మిర్జా ఫ్యాషన్ డిజైనర్ అనిత డోంగ్రేకు మ్యూస్ గా వ్యవహరించింది. ఫోటోషూట్ కోసం అద్భుతమైన లైట్ పింక్ చీరను కట్టుకొని అదరగొట్టింది. గోల్డెన్ రేషమ్ థ్రెడ్ డీటెయిల్స్ తో డిజైన్ చేసిన ఈ పాస్టల్ పింక్ శారీ లో దివి నుంచి దిగివచ్చిన అప్సరసలా మెరిసిపోయింది. సాంప్రదాయ లుక్ లో అందం అమ్మాయి అయితే ఇలా ఉంటుంది అనిపించేలా కనిపించింది.

ఈ చీరకు మ్యాచింగ్ గా, వెనుక భాగంలో నాట్ డీటెయిల్స్ తో వచ్చిన పాస్టల్ పింక్ బ్లౌజు వేసుకుంది. ఈ చీర లుక్ కు మరింత అట్రాక్షన్ ను తీసుకొచ్చేందుకు దియా తన చెవులకు స్లీక్ వైట్ ఇయర్ రింగ్స్ ను పెట్టుకుంది. మెడలో వైట్ స్టోన్స్ తో పొదిగిన చోకర్ నెక్లెస్ ను పెట్టుకుంది.

సెలబ్రిటీ స్టైలిస్ట్ తియా టెక్ చాందిని దియా కు అందమైన స్టైలిష్ లుక్స్ ను అందించింది. మేకప్ ఆర్టిస్ట్ శ్రద్దా మిశ్రా దియా అందానికి మెరుగులు దిద్దింది. కనులకు న్యూడ్ ఐ ష్యాడో, మస్కరా ఐ లైనర్ వేసుకుని ఐబ్రోస్ ని హైలెట్ చేసింది. పెదాలకు న్యూడ్ లిప్ స్టిక్ పెట్టుకొని తన అందాలతో అందరిని మైమరిపించింది.

అందాల సుందరి దియా మిర్జా ఈమధ్యన సోషల్ మీడియా లో చాలా ఆక్టివ్ గా ఉంటోంది. తన వర్క్ డీటెయిల్స్ ను పర్సనల్ విషయాలను ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ తో పంచుకుంటోంది. ఇన్ స్టాలో ఈ బ్యూటీ కి 5 మిలియన్ లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. వారి సంఖ్యను పెంచుకోవడం తో పాటు ఫ్యాన్స్ ను అలరించేందుకు అప్పుడప్పుడు ఫ్యాషన్ ఫోటో షూట్ పిక్స్ ను పోస్ట్ చేస్తుంటుంది. ఇలా పోస్ట్ చేసిన పిక్స్ అన్ని కూడా ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతాయి.
