Diwali Tips: దీపావళి అంటేనే దీపాలు, టపాసులు, స్వీట్లు గుర్తుకు వస్తాయి. హిందూ సంప్రదాయం ప్రకారం ఎంతో విశిష్టతను కలిగిన దీపావళిని దేశ, విదేశాల్లో ఉండే హిందువులు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు. దీపావళికి ఇంట్లోనే కాదు, ఆఫీసుల్లో కూడా స్వీట్లు పంచుతూ ఉంటారు. చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు గిఫ్టులుగా స్వీట్ బాక్సులు పంచడం మామూలే.
అయితే దీపావళికి స్వీట్లు తినాలని అనిపించడం సాధారణం. కానీ వాటిని తినడానికి ముందు కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవడం ద్వారా మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వీలవుతుంది. ముందుగా గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే.. దీపావళి వేళ అతిగా స్వీట్లు తినడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. అతిగా స్వీట్లు తినడం వల్ల శరీరానికి ఎంత మాత్రం మేలు కలిగించదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
దీపావళి వేళ ఇంటికి బంధువులు వచ్చారు కదా అని, వారికి స్వీట్లు తినిపించే క్రమంలో మీరు కూడా నాలుగు స్వీట్లు లాగించేస్తుంటారు జాగ్రత్త. అలా కాకుండా మీరు ఏం తిన్నా నాలుగు గంటలు బ్రేక్ ఇవ్వాలనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. దీని వల్ల శరీరం సరిగ్గా అన్నింటిని జీర్ణం చేసుకోగలుగుతుంది.
Diwali Tips
షుగర్, ఫ్యాట్, కొలెస్ట్రాల్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని గుర్తించుకోండి. స్వీట్లు అతిగా తినడం వల్ల ఇవి బ్యాలెన్స్ తప్పితే మాత్రం అది శరీరానికి చేటు చేస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇక బయటి నుండి తెచ్చిన స్వీట్ల కన్నా ఇంట్లోనే తయారు చేసిన స్వీట్లను తినడానికి ట్రై చేయండి. అలాగే చక్కెకు బదులుగా బెల్లంతో తయారు చేసిన స్వీట్లను తినండి. దీపావళి రోజు స్వీట్లు తినడంతో పాటు తగినంత నీటిని తాగాలని గుర్తుపెట్టుకోండి.