Diwali : బంధుమిత్రులతో మిఠాయిలు పంచుకుంటూ, ఇల్లంతా దీపకాంతులతో వెలుగులు నింపి బాణాసంచా కలుస్తూ ఆనందంగా జరుపుకునే పండుగ దీపావళి. చిన్న పెద్దా అని తేడా లేకుండా అందరికీ చాలా ప్రీతిపాత్రమైన పండుగ దీపావళి. ఈ పండుగ నాడు లక్ష్మీదేవి, వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈ పండుగ నాడు లక్ష్మీదేవి కటాంక్షం పొందితే మంచిదని అందరూ విశ్వసిస్తారు. అటువంటి పండుగరోజు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికాకుండా ఉండాలనే కొన్ని నియమాలు పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రహ్మస్థలం శుభ్రంగా ఉంచుకోవడం
దీపావళికి ఇంట్లోని బ్రహ్మ స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి. బ్రహ్మ స్థలం అంటే ఇంటి మధ్యలో ఉండే ప్రదేశం. దీనిని సూర్య స్థానం అని కూడా అంటారు. మనం ఇంట్లో ఉండే హాల్‌ను బ్రహ్మ స్థలం గా పరిగణించబడుతుంది. ఇది ఆశుభ్రంగా ఉంటే లక్ష్మీ దేవికి ఆగ్రహం వస్తుంది. ఇక హాల్లో ఎక్కడ పనిచేయని గడియారాలను, విరిగిపోయిన ఫర్నిచర్ ను, పగిలిపోయిన అద్దాలను ఉంచుకోకుండా చూసుకోవాలి.
దీంతోపాటు దీపావళి పండుగ నాడు ధరించే బట్టలలో నలుపు రంగు దుస్తులు లేకుండా చూసుకోవాలని పండితులు చెబుతుంటారు. నలుపు రంగు బట్టలను ఆశుభంగా పరిగణిస్తారు. కాబట్టి దీపావళి పండుగ నాడు వేసుకునే దుస్తులలో నలుపు రంగు దుస్తులు లేకుండా చూసుకోవాలి. ఇక దీపావళి పండుగ నాడు ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో ముగ్గులు వేసుకోవడం ఆనవాయితి. అయితే ముగ్గులు బియ్యం పిండితో వేసుకుంటే మంచిది. అలాగే ముగ్గులు వేసే రంగుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆ ముగ్గులో పొరపాటున కూడా నలుపు రంగును, డార్క్ బ్రౌన్ కలర్ ను ఉపయోగించకూడదని చెబుతున్నారు.
Diwali :
దీపావళి పండుగకు మనం బంధుమిత్రులను ఇంటికి పిలిచి పండుగ జరుపుకున్నాక వారికి బహుమతులను ఇస్తూ ఉంటాం. అయితే పండుగకు ఎట్టి పరిస్థులలో లెదర్ వస్తువులను గిఫ్ట్‌గా ఇవ్వకూడదు. ఇలా చేస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. అలాగే పండుగ రోజు ఇతరులను తిట్టడం, కోపంగా మాట్లాడడం, ఏడవడం వంటి పనులు చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందని, ఆమె కటాక్షం ఉండదని అంటున్నారు. ఇలా ఇక్కడ సూచించిన నియమాలు పాటిస్తూ ఈ పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకోండి.