Divi: సినిమాల్లో అవకాశాలు అనుకున్నంత సులభంగా రావు. చాలామంది ఒక్క అవకాశం కోసం హైదరాబాద్ లో కృష్ణానగర్ లో సంవత్సరాల పాటు ఎదురుచూడటం గురించి మనం తరుచుగా వింటూనే ఉంటాం. సినిమాల్లో అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాలని, ఎన్నో కష్టాలను దాటాలని పెద్దలు చెబుతూ ఉంటారు. అయినా కూడా అదృష్టం అందరికీ లభించదు.
ఇలాగే వందసార్లు ఆడిషన్స్ కి వెళ్లి రిజెక్ట్ అయిన ఒకమ్మాయి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో అవకాశం లభించింది. మెగాస్టార్ చిరంజీవే ఆ అమ్మాయికి అవకాశం ఇస్తానని మాటివ్వడం, ఆ మాట మేరకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇంతకీ ఆ లక్కీ గర్ల్ ఎవరిని ఆలోచిస్తున్నారా.. తాజాగా గాడ్ ఫాదర్ సినిమాలో మెరిసిన దివి.
బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఫేమస్ అయిన దివి.. అదే షోకి గెస్టుగా వచ్చిన చిరంజీవి వల్ల తన సినిమాలో నటించే అవకాశం కొట్టేసింది. గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవితో కలిసి నటించే అవకాశం రావడం గురించి, షూటింగ్ లో జరిగిన విషయాల గురించి, అంతకు ముందు తాను పాల్గొన్న ఆడిషన్స్ గురించి దివి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ లోకి అడుగు పెట్టడానికి ముందు తాను వందకు పైగా ఆడిషన్స్ కు హాజరు కాగా.. ఎంతో మంది తనను రిజెక్ట్ చేసినట్లు దివి తెలిపింది. వాటి వల్లే తాను ధైర్యంగా మారి.. బిగ్ బాస్ లోకి ధైర్యంగా అడుగు పెట్టినట్లు చెప్పింది.
Divi:
ఇంటర్వ్యూలో దివి మాట్లాడుతూ.. ‘బిగ్ బాస్ షో తర్వాత నా లైఫ్ ఎంతో మారింది. ప్రస్తుతం ఎంతో సంతోషంగా ఉన్నా. అక్కడ ఉన్నప్పుడే తన సినిమాలో నాకు అవకాశం ఇస్తానని మెగాస్టార్ మాటిచ్చారు. దాని ప్రకారమే గాడ్ ఫాదర్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. చిరంజీవి సినిమాలో నటించడం అద్భుతంగా అనిపించింది. అందులో నా రోల్ చూసి ప్రేక్షకులు నన్ను తిట్టుకున్నారు. వాళ్లు అంతలా తిట్టుకుంటున్నారంటే, నా పాత్రకు నేను న్యాయ చేశాననే అనుకుంటున్నా. అందుకు ఆనందంగా ఉంది. ఇక చిరంజీవి గొప్ప వ్యక్తి. చిన్నా పెద్ద అని తేడా లేకుండా తన సహనటులందరినీ ఆయన ఒకేలా చూస్తారు’ అని చెప్పుకొచ్చింది.