ఇండియన్ మైథలాజికల్ స్టోరీస్ అంటే వెంటనే అందరికి గుర్తుకొచ్చేవి రామాయణం, మహాభారతం. హిందువుల పవిత్ర గ్రంథాలుగా కూడా వీటిని అభివర్ణిస్తారు. భారతీయ సనాతన నాగరికత, ఆచార, వ్యవహారాలు, ఇప్పటికి మనం అనుసరిస్తున్న జీవన విధానాలు అన్ని కూడా రామాయణ, మహాభారత గాధల నుంచి అనుసరిస్తున్నవే. ఒక భర్త, ఒక కొడుకు ఎలా ఉండాలి అనే విషయాన్ని రామాయణం కథ చెబుతుంది. అలాగే మహాభారత గాథలో అయితే మన సమాజంలో కనిపించి రకరకాల వ్యక్తిత్వాలు ఉన్న పాత్రలు కూడా కనిపిస్తాయి. మంచి, చెడు అనే రెండు విభిన్న అంశాల మధ్య అలుముకున్న భిన్న మనస్తత్వాలు ఉన్న పాత్రలు, వాటి చిత్రణ కనిపిస్తుంది.
ఈ ప్రపంచంలో మనకున్నవి రామాయణం, మహాభారతం కథలు మాత్రమే. మనం ఎలాంటి కథ రాసుకున్న, ఏ విధంగా దానిని ప్రెజెంట్ చేసిన ఏదో ఒక మూలంలో మహాభారత కథతోనో, రామాయణంతోనో కనెక్ట్ అయ్యి ఉంటుంది. అందుకే వాటికి భారతీయులు అంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే ఎన్ని సార్లు ఆ కథలని దృశ్య రూపంలో చూసిన మళ్ళీ మళ్ళీ చూడటానికి ఇష్టపడతారు. దానికి కారణం ఆ కథలు ఎమోషనల్ గా ప్రతి భారతీయుడి హృదయానికి దగ్గరగా ఉంటాయి. ఈ నేపధ్యంలో ప్రస్తుతం ఫిల్మ్ మేకర్స్ ఈ కథలని మరోసారి భారీ తారాగణంతో, సరికొత్త టెక్నాలజీతో దృశ్య రూపంగా ఆవిష్కరించాలని అనుకుంటున్నారు.
రాజమౌళి మహాభారతం కథని 5 సిరీస్ ల సినిమాగా తెరకెక్కించాలని ఎప్పటి నుంకో అనుకుంటున్నారు. అయితే ఈ లోపే దానిని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మహాభారతం వెబ్ సిరీస్ గా తీసుకురావడానికి రెడీ అయిపోతున్నారు. బాలీవుడ్ నిర్మాత మధు మంతెనతో కలిసి భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ ని చేయాలని అనుకోని డిస్నీహాట్ స్టార్ తో టైఅప్ అయ్యి తాజాగా ఎనౌన్స్ చేసేసారు. డిస్నీ హాట్ స్టార్ దీనికి సంబంధించి ప్రోమోని అఫీషియల్ గా రిలీజ్ చేసి ప్రాజెక్ట్ గురించి కన్ఫర్మ్ చేసింది. అయితే ఈ వెబ్ సిరీస్ లని ఎవరు దర్శకత్వం వహిస్తారు అనే విషయాన్ని రివీల్ చేయలేదు. త్వరలో దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ మహాభారతం వెబ్ సిరీస్ లో నటులుగా స్టార్స్ ని తీసుకుంటారా లేక వేరే ప్రయత్నంలో వెళ్తారా అనేది ఆసక్తిగా మారింది.