సౌత్ ఇండియన్ స్టార్ హీరో సూర్య కూడా ప్రస్తుతం పాన్ ఇండియా హీరోల జాబితాలోకి చేరుతున్నాడు. తాజాగా ఆయన తన 42వ చిత్రాన్ని ఎనౌన్స్ చేశారు. ఫైట్ మాస్టర్ నుంచి దర్శకుడిగా మారి సక్సెస్ అయిన శివ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో ఏకంగా 10 బాషలలో ఈ సినిమాని ఆవిష్కరించబోతున్నారు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో హిస్టారికల్ కథాంశంతోనే ఈ సినిమా ఉండబోతుంది. ఇక ఈ మూవీలో సూర్య వారియర్ గా కనిపించబోతున్నాడని స్టిల్స్ బట్టి తెలుస్తుంది. ఇక పాన్ ఇండియా సినిమాలు అంటే పీరియాడిక్ జోనర్ కథలనే మన దర్శక నిర్మాతలు ఎంచుకుంటున్నారు.
అలాగే పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలు ఇలాంటి కథలలో చేసే అవకాశం రావడంతో హీరోలు కూడా రెడీ అవుతున్నారు. ఇక ఈసినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని కన్ఫర్మ్ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె ధ్రువీకరించింది. తాను నెక్స్ట్ సౌత్ పాన్ ఇండియా మూవీ సూర్యతో చేస్తున్నానని చెప్పుకొచ్చింది. అలాగే ఇందులో తన పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతుందని కూడా స్పష్టం చేసింది.
ఇక ఇప్పటికే ప్రభాస్ కి జోడీగా ప్రాజెక్ట్ కె మూవీలో దిశా పటాని భాగం అయ్యింది. ఇది తన రెండో పాన్ ఇండియా మూవీ అని చెప్పాలి. ఈ బ్యూటీకి బాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రాకున్నా సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్ లతో బాగా పాపులర్ అయ్యింది. ఇప్పుడు సౌత్ లో ఏకంగా రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో నటించే అవకాశాన్ని దిశా పటాని సొంతం చేసుకుంది. ఇక కోలీవుడ్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కబోతుంది. మరి ఈ మూవీతో సూర్య పాన్ ఇండియా స్థాయిలో ఏ విధంగా తన ప్రభావాన్ని చూపిస్తాడనేది చూడాలి.