Disha and Tiger Shroff : వివాహమై కొంత కాలం గడిపిన తర్వాతే విడాకులు వేరై పోతున్నారు. ఇక ప్రేమ వ్యవహారం బ్రేకప్ అవడం పెద్ద లెక్కా? సినీ ఇండస్ట్రీలో ఇదంతా కామన్ అయిపోతోంది. ఎంతో ఇష్టపడి.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుని.. అందమైన జంట అని అందరి చేతా అనిపించుకున్న జంటలే విడిపోతున్నాయి. ఇక పెళ్లిపీటలు ఎక్కకుండా విడిపోతున్న జంటలు లెక్కకు చాలానే ఉన్నాయి. తాజాగా ఓ జంట కూడా బ్రేకప్ చెప్పేసుకుందన్న విషయం సంచలనంగా మారింది. చాలా అందమైన జంటగా పేరు తెచ్చుకున్న వారిద్దరూ విడిపోయారా? అంటూ నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.
హిందీ చిత్రపరిశ్రమలో ఆ మాటకొస్తే ఏ చిత్ర పరిశ్రమలో అయినా పెళ్లిళ్లు-విడాకులు, ప్రేమాయణాలు-బ్రేకప్‌లు సర్వ సాధారణమే. కొంతకాలం కలిసున్నాక ఒకరంటే మరొకరికి పూర్తి అవగాహన వస్తుంది. దీంతో మనస్పర్థలు.. వెరసి ఒకరితో మరొకరు వివాహ బంధంలోకి అడుగుపెట్టలేమనే నిర్ణయానికి ప్రేమికులు వచ్చేస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం పెద్ద ట్విస్టే ఉంది. వివాహం కారణంగానే ఈ బాలీవుడ్ ప్రేమజంట బ్రేకప్ చెప్పుకుందనే వార్తలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ ఆ లవ్ బర్డ్స్ ఎవరంటారా? ఆ ప్రేమ పక్షులు ఎవరో కాదు యంగ్ హీరో టైగర్ ష్రాఫ్, బ్యూటీఫుల్ హీరోయిన్ దిశా పటానీ. వీరిది బాలీవుడ్‌లో అందమైన జంటగా చెప్పుకుంటారు. వీరు ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీతో అభిమానుల్లో మంచి క్రేజ్‌ను పెంచేశారు.
Disha and Tiger Shroff : హర్ట్ అయిన ఫ్యాన్స్
అయితే టైగర్ ష్రాఫ్, దిశా పటానీ డేటింగ్‌లో ఉన్నట్టు ఎప్పటి నుంచో రూమర్స్ వస్తున్నాయి. సినిమాల్లో వారి కెమిస్ట్రీ చూసి ఈ రూమర్స్ మరింత పెరిగాయి. ఇప్పుడు సడెన్‌గా వీరిద్దరూ విడిపోయారంటూ బాలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దీంతో ఈ జంటను బాగా అభిమానించే ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారు. వారిద్దరూ విడిపోవడానికి కారణమేంటని చర్చించుకుంటున్నారు. అయితే వారిద్దరూ విడిపోవడానికి వివాహమే కారణమని ఓ ఇంగ్లీష్ వెబ్‌సైట్ పేర్కొంది. వివాహం చేసుకునేందుకు దిశా పటానీ సిద్ధంగా ఉన్నా.. టైగర్ ష్రాఫ్ మాత్రం రెడీగా లేడట.కెరీర్ పరంగా మంచి స్థాయికి వెళ్లాలనుకుంటున్న టైగర్ ష్రాఫ్ పెళ్లికి నో అంటున్నాడని టాక్.